హద్దు మీరిన రఘువర్ దాస్ అహంకారం
జార్ఖండ్ ముఖ్య మంత్రి, బీజేపీ నాయకుడు రఘువర్ దాస్ అహంకారం నానాటికీ హద్దు మీరుతోంది. ఆయనవల్ల అవమానాలు భరించలేక జార్ఖండ్ ఐపీఎస్ అధికారి తనను బదిలీ చేయాలని కోరారు. ఆదివారం నాడు ముగ్గురి పట్ల దురుసుగా ప్రవర్తించిన రఘువర్ దాస్ మంగళవారం నాడు ఓ ఐపీఎస్ అధికారిని విమానాశ్రయంలో అందరి ముందూ అవమానించారు. ఐపీఎస్ అధికారి రాకేశ్ బన్సల్ ను ముఖ్యమంత్రి తీవ్రంగా అవమానించారు. “నువ్వు కుర్రవాడివి సక్రమంగా పని చేయాలి. నీ మీద అనేక ఫిర్యాదులున్నాయి. […]


జార్ఖండ్ ముఖ్య మంత్రి, బీజేపీ నాయకుడు రఘువర్ దాస్ అహంకారం నానాటికీ హద్దు మీరుతోంది. ఆయనవల్ల అవమానాలు భరించలేక జార్ఖండ్ ఐపీఎస్ అధికారి తనను బదిలీ చేయాలని కోరారు. ఆదివారం నాడు ముగ్గురి పట్ల దురుసుగా ప్రవర్తించిన రఘువర్ దాస్ మంగళవారం నాడు ఓ ఐపీఎస్ అధికారిని విమానాశ్రయంలో అందరి ముందూ అవమానించారు. ఐపీఎస్ అధికారి రాకేశ్ బన్సల్ ను ముఖ్యమంత్రి తీవ్రంగా అవమానించారు. “నువ్వు కుర్రవాడివి సక్రమంగా పని చేయాలి. నీ మీద అనేక ఫిర్యాదులున్నాయి. ఆవేశపడి పోయి బుద్ధి లేకుండా వ్యవహరించకు” అని ముఖ్యమంత్రి నలుగురి ఎదుట ఆ ఐపీఎస్ అధికారిని మందలించారు.