Telugu Global
NEWS

దావూద్ అంటే భయం లేదా? కారును తగలబెడుతారట!

అండర్‌ వరల్డ్ డాన్‌ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం ఊపందుకుంది. దావూద్ ఆస్తుల వేలం అనగానే కొనేంత ధైర్యం ఎవరు చేస్తారని అనుకున్నారు. కానీ ముంబైలో ఈ డాన్ ఆస్తులు అధిక ధరకు అమ్ముడుపోయాయి. ముంబైలోని దావూద్‌కు సంబంధించిన ఒక హెటల్‌ను జర్నలిస్ట్, ఉద్యమకారుడు బాలకృష్ణన్‌ సొంతం చేసుకున్నారు. హోటల్‌ ధరను బిడ్‌లో 1.18 కోట్ల కనీస ధర నిర్ణయించగా బాలకృష్ణన్‌ రూ. 4. 28 కోట్లకు దక్కించుకున్నారు. హోటల్‌ భవనంలో పేద విద్యార్థుల కోసం కంప్యూటర్ కోచింగ్ […]

దావూద్ అంటే భయం లేదా? కారును తగలబెడుతారట!
X

అండర్‌ వరల్డ్ డాన్‌ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం ఊపందుకుంది. దావూద్ ఆస్తుల వేలం అనగానే కొనేంత ధైర్యం ఎవరు చేస్తారని అనుకున్నారు. కానీ ముంబైలో ఈ డాన్ ఆస్తులు అధిక ధరకు అమ్ముడుపోయాయి. ముంబైలోని దావూద్‌కు సంబంధించిన ఒక హెటల్‌ను జర్నలిస్ట్, ఉద్యమకారుడు బాలకృష్ణన్‌ సొంతం చేసుకున్నారు. హోటల్‌ ధరను బిడ్‌లో 1.18 కోట్ల కనీస ధర నిర్ణయించగా బాలకృష్ణన్‌ రూ. 4. 28 కోట్లకు దక్కించుకున్నారు. హోటల్‌ భవనంలో పేద విద్యార్థుల కోసం కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు.

దావూద్‌కు చెందిన మొత్తం ఏడు ఆస్తులు వేలంలో అమ్ముడుపోయాయి. దావూద్‌కు చెందిన హ్యుండై యాక్సెంట్‌ కారును రూ. 3.32 లక్షలకు హిందూమహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి దక్కించుకున్నారు. కారును అంబులెన్స్‌ కోసం ఇస్తానని చెప్పారు. కారు అందుకు కూడా పనికి రాదంటే పెట్రోల్ పోసి తగలబెడుతానని చక్రపాణి అంటున్నారు. మాతుంగలోని మహావీర్‌ బిల్డింగ్లో దావూర్‌కు చెందిన ఒక గది కూడా 50. 4 లక్షలకు అమ్ముడుపోయింది. వేలంపాటలో పాల్గొనవద్దని దావూద్ గ్రూప్‌ నుంచి తనకు బెదిరింపు కాల్స్‌ కూడా వచ్చాయని దావూద్ ఆస్తులు సొంతం చేసుకున్న బాలకృష్ణన్‌ చెబుతున్నారు.

First Published:  10 Dec 2015 11:11 AM IST
Next Story