హాస్టళ్లకే పరిమితమైన పెద్దకూర పండగ
న్యాయస్థానాలు ఉస్మానియా యూనివర్సిటీలో తలపెట్టిన పెద్ద కూర పండగకు అనుమతించకపోవడంతో పెద్ద కూర పండగ హాస్టళ్లకే పరిమితమైంది. ఈ సందర్భంగా మొత్తం 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులను కాంపస్ ఆవరణలోకి ప్రవేశించనివ్వలేదు. బయటి వారు యూనివర్సిటీ ఆవరణలోకి ప్రవేశించకుండా సకల కట్టు దిట్టాలు చేశారు. యూనివర్సిటీ ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. పెద్ద కూర పండగ నిర్వహించడానికి ప్రయత్నించిన కొంత మంది విద్యార్థులతో పాటు ఈ పండగను […]
న్యాయస్థానాలు ఉస్మానియా యూనివర్సిటీలో తలపెట్టిన పెద్ద కూర పండగకు అనుమతించకపోవడంతో పెద్ద కూర పండగ హాస్టళ్లకే పరిమితమైంది. ఈ సందర్భంగా మొత్తం 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులను కాంపస్ ఆవరణలోకి ప్రవేశించనివ్వలేదు. బయటి వారు యూనివర్సిటీ ఆవరణలోకి ప్రవేశించకుండా సకల కట్టు దిట్టాలు చేశారు. యూనివర్సిటీ ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది.
పెద్ద కూర పండగ నిర్వహించడానికి ప్రయత్నించిన కొంత మంది విద్యార్థులతో పాటు ఈ పండగను వ్యతిరేకించిన గోషామహల్ నియోజక వర్గం నుంచి ఎన్నికైన బీజేపీ శాసన సభ్యుడు రాజా సింఘ్ తో పాటు ఈ పండగను సమర్థించిన మజ్లిస్ బచావో తెహ్రీక్ నాయకుడు అంజదుల్లాను కూడా పోలీసులు ముందు జాగ్రత్తగా అరెస్టు చేశారు. ఈ పండగను వ్యతిరేకిస్తున్న ఏబీవీపి తలపెట్టిన చలో ఉస్మానియా ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు.
పెద్ద కూర పండగ నిర్వహిస్తే ఆ విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తామని, వారి అడ్మిషన్లను కూడా రద్దు చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ సురేశ్ కుమార్ హెచ్చరించారు.