Telugu Global
National

చేను మేసిన కంచె రాజీనామా

కర్ణాటక లోకాయుక్త వై.భాస్కర రావు ఎట్టకేలకు రాజీనామా చేశారు. అవినీతి నిరోధక వ్యవస్థకు అధిపతిగాఉన్న భాస్కర్ రావు కుమారుడు లోకాయుక్త కార్యాలయాన్ని ఉపయోగించుకుని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు అనేక నెలలుగా ఉన్నాయి. ఈ ఆరోపణల కారణంగా రాజీనామా చేయాలని ఎన్ని వత్తిళ్లు వచ్చినా లొంగని వై. భాస్కర రావు రాజీనామా చేయక తప్పలేదు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. భాస్కర రావు కుమారుడు అశ్విన్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసిన తర్వాత గత […]

చేను మేసిన కంచె రాజీనామా
X

కర్ణాటక లోకాయుక్త వై.భాస్కర రావు ఎట్టకేలకు రాజీనామా చేశారు. అవినీతి నిరోధక వ్యవస్థకు అధిపతిగాఉన్న భాస్కర్ రావు కుమారుడు లోకాయుక్త కార్యాలయాన్ని ఉపయోగించుకుని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు అనేక నెలలుగా ఉన్నాయి. ఈ ఆరోపణల కారణంగా రాజీనామా చేయాలని ఎన్ని వత్తిళ్లు వచ్చినా లొంగని వై. భాస్కర రావు రాజీనామా చేయక తప్పలేదు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.

భాస్కర రావు కుమారుడు అశ్విన్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసిన తర్వాత గత జులై నుంచి లోకాయుక్త సెలవులోనే ఉన్నారు. భాస్కర రావును లోకాయుక్త పదవి నుంచి తొలగించాలని బీజేపీ, జె.డి.(ఎస్) ప్రతిపాదించిన తీర్మానం శాసన సభ పరిశీలనలో ఉంది. ఈ తీర్మానానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది.

లోకాయుక్తను తొలగించడం కోసం నిబంధనలను ఇటీవలే సరళం చేశారు. కొత్త విధానం ప్రకారం లోకాయుక్తను తొలగించాలన్న తీర్మానానికి అనుమతి లభించిన తర్వాత ఎందుకు తొలగించాలనుకుంటున్నామో కారణాలు తెలియజేస్తూ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించాలి. ఈ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే శాసన సభ లోకాయుక్తను తొలగిస్తున్నట్టు తీర్మానం ఆమోదించి గవర్నరుకు పంపించాలి.

దాడులు జరగకుండా ఉండాలంటే కోటి రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండు చేస్తూ లోకాయుక్త కార్యాలయం నుంచి ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారని లోకాయుక్త పోలీసు సూపరింటెండెంట్ సోనీ నారంగ్ లోకాయుక్త రిజిష్ట్రారుకు లేఖ రాయడంతో ఈ వార్త బయటకు పొక్కింది.

First Published:  9 Dec 2015 12:32 AM IST
Next Story