పొలాల్లో పురుగుమందులు...పిల్లలకు చేటు
పంటపొలాలకు వేసే పురుగుమందులను పీల్చిన పిల్లలకు శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. కాలిఫోర్నియాలోని శాలినాస్ వ్యాలీకి చెందిన 279 మంది పిల్లల్లో ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తగా వారికి పరీక్షలు నిర్వహించారు. వారందరి మూత్ర పరీక్షలో ఆర్గనోఫాస్పేట్ పురుగుమందు అవశేషాలు ఉన్నట్టుగా గుర్తించారు. దీని సాంద్రత పెరుగుతున్న కొద్దీ వారిలో ఊపిరి తీసుకునే సామర్ద్యం తగ్గినట్టుగా కూడా గమనించారు. పురుగుమందులను […]
పంటపొలాలకు వేసే పురుగుమందులను పీల్చిన పిల్లలకు శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. కాలిఫోర్నియాలోని శాలినాస్ వ్యాలీకి చెందిన 279 మంది పిల్లల్లో ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తగా వారికి పరీక్షలు నిర్వహించారు. వారందరి మూత్ర పరీక్షలో ఆర్గనోఫాస్పేట్ పురుగుమందు అవశేషాలు ఉన్నట్టుగా గుర్తించారు. దీని సాంద్రత పెరుగుతున్న కొద్దీ వారిలో ఊపిరి తీసుకునే సామర్ద్యం తగ్గినట్టుగా కూడా గమనించారు. పురుగుమందులను వినియోగించే వ్యవసాయ కూలీల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తడం మామూలేనని, కానీ ఈ మందులను వినియోగించే వ్యవసాయం ప్రాంతాలకు సమీపంలో నివసించే పిల్లల పరిస్థితి గురించి ఈ అధ్యయనం నిర్వహించామని ఈ పరిశోధకుల్లో ఒకరైన బ్రెండా ఎస్కెనాజీ అన్నారు. ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల వరకు వయసున్న పిల్లలకు యూరిన్ పరీక్షలు తరచుగా నిర్వహించారు. అలాగే ఏడేళ్ల పిల్లలు ఎంత గాలిని పీల్చి వదల గలుగుతున్నారో పరీక్షించారు. ఎక్కువగా పురుగుమందులు వాడే ప్రదేశాల్లో నివసిస్తున్న పిల్లల్లో శ్వాసకోశ సామర్ధ్యం, వారు పీల్చగలుగుతున్న గాలి తక్కువగా ఉన్నాయని రేచల్ రానన్ అనే పరిశోధకురాలు అంటున్నారు. థొరాక్స్ అనే మెడికల్ పత్రికలో ఈ వివరాలు వెల్లడించారు.