Telugu Global
Others

ఆనం బ్రదర్‌కు ఎమ్మెల్సీ వరకు ఓకే గానీ..!

ఇటీవల టీడీపీలో చేరిన ఆనం బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తుపై అప్పుడే చర్చ మొదలైంది. ఏ హామీతో ఆనం బ్రదర్స్ టీడీపీలోకి వచ్చారు?.. వారికి చంద్రబాబు ఇప్పుడు ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారన్న దానిపై చర్చ జరుగుతోంది. త్వరలో ఆనం బ్రదర్స్‌లో చిన్నవాడైన రామనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న వాకాటి నారాయణరెడ్డి పదవీకాలం ముగియగానే ఆయన స్థానంలో రామనారాయణరెడ్డికి అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. ఆనం రామనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి […]

ఆనం బ్రదర్‌కు ఎమ్మెల్సీ వరకు ఓకే గానీ..!
X

ఇటీవల టీడీపీలో చేరిన ఆనం బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తుపై అప్పుడే చర్చ మొదలైంది. ఏ హామీతో ఆనం బ్రదర్స్ టీడీపీలోకి వచ్చారు?.. వారికి చంద్రబాబు ఇప్పుడు ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారన్న దానిపై చర్చ జరుగుతోంది. త్వరలో ఆనం బ్రదర్స్‌లో చిన్నవాడైన రామనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న వాకాటి నారాయణరెడ్డి పదవీకాలం ముగియగానే ఆయన స్థానంలో రామనారాయణరెడ్డికి అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు.

ఆనం రామనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. రామనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఆలోచన వెనుక పెద్ద వ్యూహమే ఉందని చెబుతున్నారు. పార్టీలోకి వచ్చే వారికి తప్పకుండా అంతా మంచే జరుగుతుందన్న సంకేతాలు పంపడం ద్వారా ఇతర పార్టీల నుంచి మరింత మందిని ఆకర్శించవచ్చని చంద్రబాబు ఆలోచన అని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరికొందరు ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి కూడా దక్కుతుందని అంచనా వేస్తుండగా అదంత సులువుగా కాదని మరికొందరు అంటున్నారు.

Click to Read: Bhuma Akhila Priya Vs Gangula Nani in 2019?

రామనారాయణరెడ్డి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే… నెల్లూరుకు చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ సోమిరెడ్డి కూడా ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం సోమిరెడ్డికి కూడా ఉంది. అలాంటప్పుడు సోమిరెడ్డిని పక్కన పెట్టి రామనారాయణరెడ్డికి మంత్రి పదవి ఎలా ఇస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ సోమిరెడ్డికి మరేదైనా కేబినెట్‌ హోదా కలిగిన పదవి ఇచ్చినా… మంత్రి పదవికి ఉన్నంత విలువ ఎక్కడుంటుందని ప్రశ్నిస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి వరకు అయితే గ్యారెంటీ అని చాలా మంది భావిస్తున్నారు.

First Published:  9 Dec 2015 1:36 AM IST
Next Story