ఎవరో ఒకరు.. తేల్చుకోవాల్సింది చంద్రబాబే!
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇటీవల ఏపీకి వచ్చిన ప్రతిసారి ఒక మాట చెబుతున్నారు. తనను విమర్శించినా, రావద్దని అడ్డుకున్నా నష్టపోయేది ఆంధ్రరాష్ట్రమే అని సుత్తిమెత్తని హెచ్చరికలు చేస్తున్నారు. అసలు తాను ఏపీ నుంచి ఎన్నికైన నేతను కాదని స్వయంగా చెబుతున్నారు. అయితే 2016లో వెంకయ్యనాయుడు రాజ్యసభ సభ్యత్వం గడువు ముగుస్తోంది. దీంతో ఏపీ ప్రజాప్రతినిధిగా మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2016లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. బలాబలాలను చూస్తే టీడీపీ – బీజేపీ కలిసి […]
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇటీవల ఏపీకి వచ్చిన ప్రతిసారి ఒక మాట చెబుతున్నారు. తనను విమర్శించినా, రావద్దని అడ్డుకున్నా నష్టపోయేది ఆంధ్రరాష్ట్రమే అని సుత్తిమెత్తని హెచ్చరికలు చేస్తున్నారు. అసలు తాను ఏపీ నుంచి ఎన్నికైన నేతను కాదని స్వయంగా చెబుతున్నారు. అయితే 2016లో వెంకయ్యనాయుడు రాజ్యసభ సభ్యత్వం గడువు ముగుస్తోంది. దీంతో ఏపీ ప్రజాప్రతినిధిగా మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
2016లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. బలాబలాలను చూస్తే టీడీపీ – బీజేపీ కలిసి మూడు గెలుచుకునే చాన్స్ ఉంది. వైసీపీకి మరో స్థానం దక్కుతుంది. టీడీపీ- బీజేపీ కోటాలో ఒక స్థానం బీజేపీకి కేటాయించినా ఆ స్థానం కోసం ఇప్పుడు వెంకయ్యనాయుడుతో పాటు మరో కేంద్రమంత్రి నిర్మాలాసీతారామన్ గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మరణంలో ఖాళీ అయిన స్థానం నుంచి టీడీపీ కోటాలో సీతారామన్ ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆమె పదవి కాలం కూడా మార్చి 2016తో ముగుస్తోంది. దీంతో మరోసారి కొనసాగింపు ఇవ్వాలని చంద్రబాబును ఆమె గట్టిగా కోరుతున్నారు.
Click to Read ఆళ్ళగడ్డలో యూత్ పాలిటిక్స్
అదే చేస్తే వెంకయ్యనాయుడుకు అవకాశం ఉండదు. ఎందుకంటే వెంకయ్య, నిర్మలాసీతారామన్ ఇద్దరూ కూడా బీజేపీ వాళ్లే. కాబట్టి ఏపీలో తక్కువ బలం ఉన్న బీజేపీకి టీడీపీ కోటాలో రెండు రాజ్యసభ స్థానాలు ఇవ్వడం దాదాపు జరక్కపోవచ్చు. ఇప్పటికే కర్నాటక నుంచి మూడుసార్లు రాజ్యసభకు ఎంపికైన వెంకయ్యకు అక్కడ మరోసారి చోటు దక్కే చాన్స్ లేదని చెబుతున్నారు. కర్నాటక నేతలు కూడా ఈసారి లోకల్ వారికే అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు.
పైగా మూడుసార్లకు మించి ఒక వ్యక్తికి రాజ్యసభ అకాశం ఇవ్వకూడదన్న బీజేపీ నిబంధన కూడా వెంకయ్యకు ఇబ్బంది పెడుతోంది. అందుకే టీడీపీ కోటాలో ఏపీ నుంచి ఎంపికవడం ద్వారా బీజేపీ నిబంధన నుంచి కూడా మినహాయింపు పొందవచ్చని వెంకయ్య ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు వెంకయ్యనాయుడు కావాలో… నిర్మాల సీతారామన్ కొనసాగాలో నిర్ణయించాల్సింది ఎక్కవ శాతం చంద్రబాబే.
Click to Read: When KCR’s best friend meets KCR’s worst enemy!