రాహుల్, సోనియాకు నేషనల్ హెరాల్డ్ ఉచ్చు
వీకే సింగ్ వ్యాఖ్యలు, పాకిస్తాన్‌తో బ్యాంకాక్‌లో రహస్య చర్చలు, దేశంలో పెరిగిపోతున్న అసహనం తదితర అంశాలతో బీజేపీని ఇరుకున పెడదామనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు తానే ఇబ్బందుల్లో పడింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎదురు దెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తమకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ హైకోర్టులో సోనియా, రాహుల్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో మంగళవారం వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని ఎలాగైనా ఆపేందుకు […]
BY sarvi7 Dec 2015 11:07 PM GMT
X
sarvi Updated On: 8 Dec 2015 11:49 PM GMT
వీకే సింగ్ వ్యాఖ్యలు, పాకిస్తాన్‌తో బ్యాంకాక్‌లో రహస్య చర్చలు, దేశంలో పెరిగిపోతున్న అసహనం తదితర అంశాలతో బీజేపీని ఇరుకున పెడదామనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు తానే ఇబ్బందుల్లో పడింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎదురు దెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తమకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ హైకోర్టులో సోనియా, రాహుల్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో మంగళవారం వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని ఎలాగైనా ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సోనియా తరఫు న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు గడప తొక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కేసు నేపథ్యం ఇది!
స్వాతంత్రానికి పూర్వం 1938లో నెహ్రూ నేషనల్ హెరాల్డ్ అనే జాతీయ ఆంగ్ల పత్రికను స్థాపించారు. నిర్వహణలోపం, యాజమాన్యంనిర్లక్ష్యం, దయనీయమైన సర్కులేషన్ తదితర కారణాలతో పత్రికను సోనియాగాంధీ 2008లో మూసివేశారు. ఈ పత్రిక ప్రచురుణ సంస్థ అసోసియేటెడ్ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల వడ్డీలేని రుణం ఇచ్చింది. 2010లో ఈ రుణాన్ని వసూలు చేసే బాధ్యతను సోనియా-రాహుల్ డైరెక్టర్లుగా యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) అనే సంస్థ కు అప్పగించారు. అందుకోసం ఫీజుగా కేవలం రూ.50 లక్షలు చెల్లించారు. ఆ విధంగా కేవలం రూ.50లక్షల ఖర్చుతో నేషనల్ హెరాల్డ్‌కు చెందిన వేలకోట్ల రూపాయల ఆస్తులను సోనియా రాహుల్ తమ స్వాధీనం చేసుకున్నారని బీజేపీ నేత సుబ్రమణ్యం కోర్టులో పిటిషన్ వేశారు. రెండు చోట్ల సోనియా-రాహుల్ అధ్యక్షపదవిలో ఉండటం, ఆస్తుల క్రయవిక్రయాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, వేల కోట్లరూపాయల ఆస్తులను సులువుగా చేజిక్కించుకున్నారన్నది ఆయన ఆరోపణ.
కాంగ్రెస్ గొంతులో పచ్చివెలక్కాయ!
దళితులపై వీకే సింగ్ వ్యాఖ్యలు, పాక్‌తో రహస్య చర్చలు, అసహనం తదితర విషయాల్లో ప్రధానిని ఇరుకున పెట్టాలన్న కాంగ్రెస్ వ్యూహం తాజా కోర్టు తీర్పుతో బెడిసికొట్టింది. దీంతో కాంగ్రెస్ నేతల గొంతులో పచ్చివెలక్కాయపడినట్లయిం ది. ఈ అంశంపై నేడు పార్లమెంటులో అధికార పక్షం చేసే దాడిని కాంగ్రెస్ తిప్పి కొడుతుందా? లేదా ఆత్మరక్షణలో పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story