ఆళ్ళగడ్డలో యూత్ పాలిటిక్స్
కర్నూలుజిల్లా ఆళ్ళగడ్డ రాజకీయాలు ఇప్పుడు యువత చేతిలోకి వెళ్తున్నాయి. శోభానాగిరెడ్డి అకాలమరణంతో సంక్షోభకాలంలో రాజకీయాల్లోకి భూమా అఖిలప్రియ ఎంటరవగా ఇప్పుడు ప్రత్యర్థి వర్గం కూడా యువతను ప్రోత్సహిస్తోంది. ఆళ్ళగడ్డలో దశాబ్దాలుగా భూమా, గంగుల కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల కాలంలో భూమా కుటుంబమే నియోజకవర్గంపై గట్టి పట్టు సాధించింది. శోభానాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన బైఎలక్షన్‌లో అఖిలప్రియ ఏకగ్రీవంగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆళ్ళగడ్డ నుంచి భూమా కుటుంబం తరపున అఖిలప్రియే పోటీ […]
కర్నూలుజిల్లా ఆళ్ళగడ్డ రాజకీయాలు ఇప్పుడు యువత చేతిలోకి వెళ్తున్నాయి. శోభానాగిరెడ్డి అకాలమరణంతో సంక్షోభకాలంలో రాజకీయాల్లోకి భూమా అఖిలప్రియ ఎంటరవగా ఇప్పుడు ప్రత్యర్థి వర్గం కూడా యువతను ప్రోత్సహిస్తోంది.
ఆళ్ళగడ్డలో దశాబ్దాలుగా భూమా, గంగుల కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల కాలంలో భూమా కుటుంబమే నియోజకవర్గంపై గట్టి పట్టు సాధించింది. శోభానాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన బైఎలక్షన్‌లో అఖిలప్రియ ఏకగ్రీవంగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆళ్ళగడ్డ నుంచి భూమా కుటుంబం తరపున అఖిలప్రియే పోటీ చేయడం దాదాపు ఖాయం. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడిని బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Click to Read: Is TDP getting washed out in Hyderabad?
తన కుమారుడు బిజేంద్రారెడ్డి అలియాస్ గంగుల నానిని ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తిప్పుతున్నారు గంగుల ప్రభాకర్ రెడ్డి. అఖిల ప్రియపై తాను పోటీ చేయడం కన్నా కొడుకును తెరపైకి తీసుకురావడం ద్వారా యూత్ వర్సెస్ యూత్ అన్న ఫార్ములాను పాటిస్తున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2019 ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, గంగుల బిజేంద్రారెడ్డి మధ్య ఆసక్తికర పోరు సాగుతుందని అంచనా వేస్తున్నారు.
అయితే గంగులకు, టీడీపీకే చెందిన ఇరిగెల రామపుల్లారెడ్డి వర్గానికి మధ్య పడడం లేదు. గంగుల ప్రభాకర్ రెడ్డి 2014 ఎన్నికలకు ముందు టీడీపీలోకి రాగా… రామపుల్లారెడ్డి మాత్రం తొలినుంచి పార్టీని నమ్ముకునే ఉన్నారు. అయితే ఇప్పుడు గంగుల ప్రభాకర్ రెడ్డి ఏకంగా తన వారసత్వాన్ని కూడా రంగంలోకి దింపుతుండడంతో రామపుల్లారెడ్డి వర్గం అసంతృప్తిగా ఉంది.