వైట్లను దూషించి తానే బద్నామైన కోన
ఒకరిని వేలెత్తి చూపిస్తే.. తన వైపు నాలుగు వేళ్లు చూపిస్తాయన్న సంగతి మరిచిపోయాడు రచయిత కోన వెంకట్! బ్రూస్ లీ సినిమా పరాజయానికి తనకేం మాత్రం సంబంధం లేదని ప్రెస్ మీట్లు పెట్టి మరీ లోకమంతా చాటింపేశాడు. తప్పు తనది కాదని బురద మొత్తం శ్రీను వైట్లకు అంటించే ప్రయత్నం చేశాడు. ఒక సందర్భంలో కోర్టుకు వెళ్తానని కోన చెప్పాడని వార్తలు వచ్చాయి. పోనీ ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడా.. అంటే అదీ లేదు. ఇటీవల తన […]
BY sarvi7 Dec 2015 12:32 AM IST
X
sarvi Updated On: 7 Dec 2015 4:44 AM IST
ఒకరిని వేలెత్తి చూపిస్తే.. తన వైపు నాలుగు వేళ్లు చూపిస్తాయన్న సంగతి మరిచిపోయాడు రచయిత కోన వెంకట్! బ్రూస్ లీ సినిమా పరాజయానికి తనకేం మాత్రం సంబంధం లేదని ప్రెస్ మీట్లు పెట్టి మరీ లోకమంతా చాటింపేశాడు. తప్పు తనది కాదని బురద మొత్తం శ్రీను వైట్లకు అంటించే ప్రయత్నం చేశాడు. ఒక సందర్భంలో కోర్టుకు వెళ్తానని కోన చెప్పాడని వార్తలు వచ్చాయి. పోనీ ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడా.. అంటే అదీ లేదు. ఇటీవల తన తాజా చిత్రం శంకరాభరణం చిత్రం విడుదలకు ముందు కూడా శ్రీనువైట్లపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేశాడు. పైపెచ్చు తనను కాంట్రవర్సీల్లోకి లాగకండి.. అంటూనే శ్రీను వైట్లతో తనకున్న కాంట్రవర్సీని మొత్తం మీడియా ముందు కక్కేశాడు.
శంకరాభరణంతో తెలిసివచ్చింది..!
దర్శకుడు షిప్ ఆఫ్ ద కెప్టెన్ అంటారు. బ్రూస్‌లీ పరాజయానికి కారణం శ్రీను వైట్ల అన్నది కోన వాదన. ఆ విషయాన్ని పక్కన బెడితే శంకరాభరణం సినిమాకు కథ-మాటలు- స్క్రీన్‌ప్లే- దర్శకత్వ పర్యవేక్షణ (నిజానికి దర్శకత్వం కూడా ఆయనే చేశాడని రూమర్) ఇలా పలు రకాల బాధ్యతలు నిర్వహించాడు కోన. ఇప్పుడేమైంది? సినిమా ఫలితం.. సో.. సో.. అని తేలింది. దీంతో పరాజయం అంటే ఎరగని పరాక్రమవంతుడుగా తనను తాను ఊహించుకున్న కోనకు విషయం తెలిసివచ్చిందంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. ఇప్పుడు కోనపై పలువురు విమర్శలు మొదలు పెట్టారు. సినిమా పరాజయం పాలైతే ఇంతకముందెవరూ కోన స్థాయిలో దర్శకుడిపై విమర్శలు చేసిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు. సినిమా అన్నాక హిట్లు.. ఫట్లు కామన్ అని దానికి ఒక వ్యక్తిని లక్ష్యగా చేసుకుని, ప్రెస్ మీట్లు పెట్టి మరీ నిందలు వేయడం తగదంటున్నారు. ఇకనైనా కోన తీరు మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు.
Next Story