ఆ చానల్‌కు ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చిన దానం
తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారడంపై కథనం ప్రసారం చేసిన ఒక చానల్‌కు దానం నేరుగా ఫోన్ చేశారు. ” నేను పార్టీ మారుతున్నట్టు మీ చానల్ పనిగట్టుకుని ప్రచారం చేస్తోంది” అని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా చేయవద్దని కోరారు. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని చెప్పారు. పార్టీపై అలిగిన మాట వాస్తవమేనని… ఆ హక్కు తనకుందన్నారు. తన పోరాటం పార్టీ వేదికపైనే ఉంటుందని […]
తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారడంపై కథనం ప్రసారం చేసిన ఒక చానల్‌కు దానం నేరుగా ఫోన్ చేశారు. ” నేను పార్టీ మారుతున్నట్టు మీ చానల్ పనిగట్టుకుని ప్రచారం చేస్తోంది” అని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా చేయవద్దని కోరారు. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని చెప్పారు.
పార్టీపై అలిగిన మాట వాస్తవమేనని… ఆ హక్కు తనకుందన్నారు. తన పోరాటం పార్టీ వేదికపైనే ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ఫ్లెక్సీలు కూడా సిద్ధం చేశారట కదా అని యాంకర్ ప్రశ్నించగా… ”ఫ్లెక్సీలదేముంది…తాను కూడా కేసీఆర్, చంద్రబాబే కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు సిటీ మొత్తం ఫ్లెక్సీలు పెట్టించగలను?” అని అన్నారు. ఎవరో ఫ్లెక్సీలు సిద్ధం చేసుకుంటే అందుకు తనను బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదన్నారు.
పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయం చూసి షబ్బీర్ అలీ కూడా కన్నీరు పెట్టుకున్నారని దానం చెప్పారు. కొందరు వ్యక్తులు పార్టీలో పనిగట్టుకుని తనను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అయినా వాటిని ఎదుర్కొని పార్టీలో ఉంటానని స్పష్టం చేశారు. రేపటి నుంచి ప్రచార రంగంలోకి దిగుతున్నామని ఇక చూడండి ఎలా ఉంటుందో అని దానం చెప్పారు.