బ్రూస్‌లీ మళయాళంలోనూ డిజాస్టరే
ఒక భాషలో హిట్టయిన చిత్రం మరో భాషలో ప్లాపవడం మనం చూస్తుంటాం. ఒక్కోసారి ఈ ఫలితం వ్యతిరేకంగానూ ఉంటుంది. అందుకే మన దేశంలో నిర్మాతలు ఒక చిత్రాన్ని నిర్మించి నాలుగైదు భాషల్లోకి డబ్బింగ్ చేసి వదులుతుంటారు. కనీసం ఒక భాషలోనైనా సానుకూల ఫలితం రాకపోతుందా? అన్నది వీరి ఆశకు కారణం. ఒకేఒక్కడు, అపరిచితుడు లాంటి చిత్రాలు తెలుగు, తమిళంలో హిట్టయినా హిందీలో భారీ పరాజయాన్ని మూటగట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. అదే ఐ-మనోహరుడు సినిమాను తెలుగు, హిందీ భాషల్లో […]
BY sarvi7 Dec 2015 12:35 AM IST
X
sarvi Updated On: 7 Dec 2015 5:17 AM IST
ఒక భాషలో హిట్టయిన చిత్రం మరో భాషలో ప్లాపవడం మనం చూస్తుంటాం. ఒక్కోసారి ఈ ఫలితం వ్యతిరేకంగానూ ఉంటుంది. అందుకే మన దేశంలో నిర్మాతలు ఒక చిత్రాన్ని నిర్మించి నాలుగైదు భాషల్లోకి డబ్బింగ్ చేసి వదులుతుంటారు. కనీసం ఒక భాషలోనైనా సానుకూల ఫలితం రాకపోతుందా? అన్నది వీరి ఆశకు కారణం. ఒకేఒక్కడు, అపరిచితుడు లాంటి చిత్రాలు తెలుగు, తమిళంలో హిట్టయినా హిందీలో భారీ పరాజయాన్ని మూటగట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. అదే ఐ-మనోహరుడు సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకులు తిరస్కరించగా తమిళంలో యావరేజ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ఇదే కోవలో వెళ్లిన బ్రూస్‌లీ నిర్మాతలకు మాత్రం.. అన్ని చోట్లా.. నిరాశే ఎదురైంది. తెలుగులో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే!
ఇతర భాషల్లోనూ…!
మెగాస్టార్ తనయుడు రాంచరణ్ హీరోగా నటించిన బ్రూస్‌లీ తెలుగులో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. చివరికి చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ కూడా చిత్రాన్ని కాపాడలేకపోయింది. భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలైనా రెండు రోజులకే చాలా చోట్ల ప్రేక్షకులు పలచబడ్డారు. భద్రకాళీ ఫిలింస్ అనే సంస్థ ఈ చిత్రం తమిళ, మళయాళ హక్కులు దక్కించుకుంది. తమిళంలోనూ బ్రూస్‌లీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో నిర్మాతలు నీరుగారి పోయారు. అందుకే మళయాళంలో విడుదల చేసేందుకు మంచి సమయం కోసం ఎదురు చూశారు. అదును చూసి నవంబరు ఆఖరు వారంలో మళయాళంలో విడుదల చేశారు. అయితే, మొదటిరోజు స్పందన ఫరవాలేదనిపించినా.. రెండోరోజు నుంచి ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈ దెబ్బతో మొత్తం దక్షిణాదిన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నట్లు అయింది.
Next Story