ఉండవల్లి ఆరోపణలు నిజమేనా?
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చంద్రబాబుపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 333కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్ పనులను తన సన్నిహితులకు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. పనులు దక్కించుకుకున్న టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ కంపెనీకి హెరిటేజ్ ఫుడ్స్‌తో సన్నిహిత సంబంధాలున్న వేమూరి హరిప్రసాద్ డైరెక్టర్‌గా ఉన్నారని అన్నారు. చౌక దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాన్ని అమర్చడంలో విఫలమైన టెరా సాప్ట్‌వేర్ సంస్థకు ఇంత పెద్ద ప్రాజెక్టు ఎలా అప్పగించారని ఉండవల్లి ప్రశ్నించారు. మే 11న కంపెనీని ప్రభుత్వమే […]
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చంద్రబాబుపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 333కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్ పనులను తన సన్నిహితులకు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. పనులు దక్కించుకుకున్న టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ కంపెనీకి హెరిటేజ్ ఫుడ్స్‌తో సన్నిహిత సంబంధాలున్న వేమూరి హరిప్రసాద్ డైరెక్టర్‌గా ఉన్నారని అన్నారు. చౌక దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాన్ని అమర్చడంలో విఫలమైన టెరా సాప్ట్‌వేర్ సంస్థకు ఇంత పెద్ద ప్రాజెక్టు ఎలా అప్పగించారని ఉండవల్లి ప్రశ్నించారు.
మే 11న కంపెనీని ప్రభుత్వమే బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి కంపెనీకి తిరిగి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫైబర్ గ్రిడ్ పనులు ఎలా అప్పగిస్తారని నిలదీశారు. ఈ అప్పగింత వెనుక అవకతవకలు జరిగాయని దమ్ముంటే సమగ్ర విచారణ జరిపించి నిజాయితీ నిరూపించుకోవాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు.