వరద బురద- జయ వర్సెస్ కమల్
చెన్నై ఇంకా వరద నీటిలో ఉండగానే విమర్శలు ప్రతివిమర్శలు మొదలయ్యాయి. అయితే జయ సర్కార్‌పై ప్రముఖుల వైపు నుంచి కమల్‌హాసన్ తొలిరాయి విసిరారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము ఏమైందని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై జయ వైపు నుంచి తీవ్రస్థాయిలో స్పందన వచ్చింది. కొందరు రాజకీయ నాయకుల చేతిలో కమల్‌హసన్ తోలుబొమ్మలా మారి విమర్శలు చేస్తున్నారని తమిళనాడు ఆర్థిక […]
చెన్నై ఇంకా వరద నీటిలో ఉండగానే విమర్శలు ప్రతివిమర్శలు మొదలయ్యాయి. అయితే జయ సర్కార్‌పై ప్రముఖుల వైపు నుంచి కమల్‌హాసన్ తొలిరాయి విసిరారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము ఏమైందని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై జయ వైపు నుంచి తీవ్రస్థాయిలో స్పందన వచ్చింది.
కొందరు రాజకీయ నాయకుల చేతిలో కమల్‌హసన్ తోలుబొమ్మలా మారి విమర్శలు చేస్తున్నారని తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి పన్నీర్ సెల్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 40 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని ఆ సమయంలో ప్రభుత్వానికి అండగా నిలబడాల్సింది పోయి కమల్ హసన్ దిగజారి విమర్శలు చేశారని పన్నీర్ మండిపడ్డారు. ప్రకృతి విపత్తులను ఒక పాట, ఒక డ్యాన్స్‌తో ఆపలేమన్న సంగతి గుర్తించుకోవాలని జయలలిత కూడా సన్నిహితుల వద్ద కమల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.