ఐటీకి బెరుకు, ఇన్సురెన్స్‌కు వణుకు
చెన్నై మహానగరాన్ని వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. వర్షబీభత్సం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ హబ్ గా పేరున్న చెన్నై మహానగరాన్ని నిలువునా ముంచింది. ఐటీ. కమ్యునికేషన్స్, ఇన్సూరెన్స్ రంగాలకు కూడా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వరద నీటిలో చిక్కుకున్న చెన్నై మహానగరం ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తోంది. చెన్నైలో నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వరద ముంచెత్తింది. దీంతో ఐటీ కంపెనీలన్నీ జలమయం అయ్యాయి. ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రాజెక్టులు నిలిచిపోయాయి. […]
BY sarvi6 Dec 2015 7:46 AM IST
X
sarvi Updated On: 7 Dec 2015 6:22 AM IST
చెన్నై మహానగరాన్ని వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. వర్షబీభత్సం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ హబ్ గా పేరున్న చెన్నై మహానగరాన్ని నిలువునా ముంచింది. ఐటీ. కమ్యునికేషన్స్, ఇన్సూరెన్స్ రంగాలకు కూడా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వరద నీటిలో చిక్కుకున్న చెన్నై మహానగరం ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తోంది.
చెన్నైలో నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వరద ముంచెత్తింది. దీంతో ఐటీ కంపెనీలన్నీ జలమయం అయ్యాయి. ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రాజెక్టులు నిలిచిపోయాయి. సెకన్లను కూడా లెక్కలేసుకుని డబ్బులు వసూలు చేసుకునే ఐటీ కంపెనీలు వారాల తరబడి మూతపడడంతో యుద్ధప్రాతిపదికన తమ ఉద్యోగులను బెంగళూరు, హైదరాబాద్, పూణేలకు తరలించాయి. చెన్నైలో ఉండడం తమ భవిష్యత్తుకే దెబ్బని బావిస్తున్నాయి. దీంతో పలు కంపెనీలు ఇతర నగరాలకు మకాం మార్చాలన్న ఆలోచనలో పడ్డాయి. ఇన్ఫోసిస్ సహా టీసీఎస్, ఐబీఎం, హెచ్ సీఎల్, విప్రో, కాగ్నిజెంట్ లాంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఉద్యోగులను మరోచోటికి షిఫ్ట్ చేశాయి.
ఇక సౌతిండియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ హబ్‌గా చెన్నైకి పేరు. ఈ రంగంలో దేశంలోనే రెండో స్థానం. ఇంత పెద్ద పరిశ్రమ వరదలకు అతలాకుతలం అయింది. దీంతో హుందాయ్, ఫోర్డ్, బీఎండబ్ల్యూ, నిస్సాన్, టీవీఎస్, రెనాల్ట్-నిస్సాన్, అశోక్ లెలాండ్ వంటి పేరు మోసిన ఆటో మొబైల్ కంపెనీల దిగ్గజాల ఫ్యాక్టరీలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు వరదలకు వీటిలో చాలావరకు మూతపడ్డాయి. ఒక్క ఆటోమొబైల్ రంగానికే 2వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు అంచనా.
ఇక వరదల కారణంగా టెలికాం రంగానికి కూడా వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కేవలం నెట్‌వర్క్ ల పునరుద్ధరణకే వందల కోట్లు ఖర్చయ్యే పరిస్థితి ఉందని అంచనా. మరోవైపు ఇన్సూరెన్స్ రంగాన్ని కూడా భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ప్రధాన కంపెనీలతోపాటు అనేక కంపెనీలు తమ సంస్థలకు ఇన్సూరెన్స్ చేయించి ఉంటాయి. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఫ్యూజర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ వంటి కంపెనీలకు ఇప్పటికే వందలాది క్లెయిమ్స్ అందాయి. దీంతో వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని అంచనా. మొత్తం మీద చెన్నై మహానగరం ఇప్పటికిప్పుడు కోలుకునే పరిస్థితి లేదు.
Next Story