తిరుమలలో ఆక్టోపస్ గస్తీ
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. డిసెంబర్ ఆరు బాబ్రీ మసీదు కూల్చివేత దినం(బ్లాక్ డే) కావడంతో కొండపై తనిఖీలను ముమ్మరం చేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ నిరంతరం తనిఖీలు కొనసాగిస్తున్నాయి. సీసీ కెమెరాలతో ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆక్టోపస్ దళాలు ఆలయం వద్ద గస్తీ నిర్వహించాయి. నాలుగు మాడ విధుల్లో తిరుగుతూ పహారా కాశాయి.