Telugu Global
Others

ఆ వెబ్‌సైట్లను నిషేధించడం కుదరదుః సుప్రీం

అసభ్యకరమైన, అభ్యంతరకరమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సోషల్ నెట్‌వర్కింగ్‌ సైట్లను నిషేధించాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. వాట్సాప్‌ ద్వారా ఒక అత్యాచార వీడియో వ్యాప్తి జరుగుతుండడంపై హైదరాబాద్‌కు చెందిన ప్రజ్వల సంస్థ అధ్యక్షురాలు సునీతా కృష్ణన్‌ దాఖలు పిటిషన్‌ను విచారించిన కోర్టు… పిటిషనర్‌ కోరిక సరైన పరిష్కారం కాదని అభిప్రాయపడింది. అదే సమయంలో అసభ్యకరమైన సమాచార వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్న సోషల్ మీడియా నెట్‌ వర్కింగ్ సైట్లపై విచారణ జరిపే అవకాశం ఉందా […]

ఆ వెబ్‌సైట్లను నిషేధించడం కుదరదుః సుప్రీం
X

అసభ్యకరమైన, అభ్యంతరకరమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సోషల్ నెట్‌వర్కింగ్‌ సైట్లను నిషేధించాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. వాట్సాప్‌ ద్వారా ఒక అత్యాచార వీడియో వ్యాప్తి జరుగుతుండడంపై హైదరాబాద్‌కు చెందిన ప్రజ్వల సంస్థ అధ్యక్షురాలు సునీతా కృష్ణన్‌ దాఖలు పిటిషన్‌ను విచారించిన కోర్టు… పిటిషనర్‌ కోరిక సరైన పరిష్కారం కాదని అభిప్రాయపడింది. అదే సమయంలో అసభ్యకరమైన సమాచార వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్న సోషల్ మీడియా నెట్‌ వర్కింగ్ సైట్లపై విచారణ జరిపే అవకాశం ఉందా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. అలాంటి అవకాశాలను పరిశీలించాలని సూచించింది.

వాట్సాప్‌లో లైంగిక దృశ్యాలను అప్‌లోడ్ చేసిన వ్యక్తులను గుర్తించడం కష్టమైన పని అని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. కంప్యూటర్ ద్వారా ఇలాంటి నేరానికి పాల్పడితే సులువగానే గుర్తించవచ్చని… కానీ మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే తంతును అడ్డుకోవడం సాధ్యం కాదని తెలిపింది. ”ఈ రోజు సోషల్ మీడియా సైట్లను నిషేధించమంటారు… రేపు ఏకంగా సెల్‌ఫోన్లను కూడా నిషేధించమని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిషేధం అన్నది సరైన పరిష్కారం కాదు” అని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

First Published:  5 Dec 2015 2:29 AM GMT
Next Story