Telugu Global
Cinema & Entertainment

డైమండ్ రాజాగా... బొబ్బిలి రాజా!

విక్ట‌రీ  వెంక‌టేశ్ మున‌ప‌టిలా వేగంగా సినిమాలు చేయ‌డం లేదు. కొంత‌కాలంగా క‌థ‌ల విష‌యంలో చాలా సెలెక్టివ్ గా వ్య‌వ‌హ‌రిస్తూ కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్రాల‌కే ప్రాధాన్యం ఇస్తున్నాడు. దృశ్యం, గోపాల‌-గోపాల హిట్ల త‌రువాత హాట్రిక్‌పై క‌న్నేశాడు. ఇందుకోసం ఏడాదికాలంగా చాలా క‌థ‌లు విన్నా.. అవేవీ ఓకే చేయ‌లేదు. ఎట్ట‌కేల‌కు మారుతి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమాకు స‌రేన‌న్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా షూటింగ్ డిసెంబ‌రు 16 నుంచి మొద‌ల‌వనుంది. ఇందులో న‌య‌న‌తార క‌థానాయిక‌. షూటింగ్ కి స‌ర్వం […]

డైమండ్ రాజాగా... బొబ్బిలి రాజా!
X
విక్ట‌రీ వెంక‌టేశ్ మున‌ప‌టిలా వేగంగా సినిమాలు చేయ‌డం లేదు. కొంత‌కాలంగా క‌థ‌ల విష‌యంలో చాలా సెలెక్టివ్ గా వ్య‌వ‌హ‌రిస్తూ కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్రాల‌కే ప్రాధాన్యం ఇస్తున్నాడు. దృశ్యం, గోపాల‌-గోపాల హిట్ల త‌రువాత హాట్రిక్‌పై క‌న్నేశాడు. ఇందుకోసం ఏడాదికాలంగా చాలా క‌థ‌లు విన్నా.. అవేవీ ఓకే చేయ‌లేదు. ఎట్ట‌కేల‌కు మారుతి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమాకు స‌రేన‌న్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా షూటింగ్ డిసెంబ‌రు 16 నుంచి మొద‌ల‌వనుంది. ఇందులో న‌య‌న‌తార క‌థానాయిక‌. షూటింగ్ కి స‌ర్వం సిద్ధమైనా.. సినిమా టైటిల్ ఇంకా ఖ‌రారు కాలేదు. తొలుత ఈ సినిమాకు రాధా, రాధాక్రిష్ణ వంటి పేర్లు వినిపించినా అవేమీ నిజం కావ‌ని మారుతి తేల్చేశాడు.
డైమండ్ రాజాకు బాబు మొగ్గు!
సినిమా ప్రారంభ‌య్యేలోగా టైటిల్‌ను అనౌన్స్ చేద్దామ‌ని అనుకున్నాడు మారుతి. అందుకోసం నాలుగు టైటిల్స్‌ని సిద్ధం చేసిన మారుతి వాటిలో వేటినో ఒక‌దానిని ఫైన‌ల్ చేయ‌మ‌ని వెంక‌టేశ్‌కి సూచించాడ‌ట‌. బాబు బంగారం, రాజార‌త్నం, డైమండ్‌రాజా, 24 క్యారెట్ బంగారం టైటిళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో బాబు బంగారం బావుంటుంద‌ని మారుతి అభిప్రాయ‌ప‌డ‌గా, డైమండ్ రాజా అయితే బాగుంటుంద‌ని వెంక‌టేశ్ చెప్పిన‌ట్లు స‌మాచారం. అయితే ఇంకా దేనిని ఖ‌రారు చేయ‌లేదు. దీంతో ఎలాగూ సినిమా షూటింగ్‌కు ఇంకా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి, ఆలోపు మిగిలిన ప‌నులు చూసుకుంటున్నాడ‌ట మారుతి. ఈ విష‌యం తెలిసిన అభిమానులు మాత్రం 1990లో వ‌చ్చిన బొబ్బిలి రాజా సూప‌ర్‌హిట్ అయింది కాబ‌ట్టి, ఈ దీనికి డైమండ్ రాజా అని పెట్టాల‌ని కోరుకుంటున్నారు. స‌హ‌జంగా సెంటిమెంట్‌ల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వెంక‌టేశ్ కూడా డైమండ్ రాజాకే మొగ్గు చూపుతార‌నే టాక్ వినిపిస్తోంది.
First Published:  4 Dec 2015 12:32 AM IST
Next Story