పైత్యం పరాకాష్టకు చేరింది
ఒకవైపు చెన్నై నగరం నరకం అనుభవిస్తుంటే అన్నాడీఎంకే కార్యకర్తలు మాత్రం అమ్మ(జయలలిత) భజన మొదలుపెట్టారు. అమ్మ ది గ్రేట్ అంటూ పోస్టర్లు వేశారు. అంతటితో ఆగి ఉంటే పర్వాలేదు. ఏకంగా బాహుబలిలోని పోస్టర్‌ను మార్పింగ్ చేసి రమ్యకృష్ణ స్థానంలో జయను ఉంచారు. చెన్నై నగరవాసులను అమ్మ కాపాడుతోందంటూ కొటేషన్లు రాశారు. ఇలా ఒక చోట కాదు పలు చోట్ల భారీ పోస్టర్లను అతికించారు. ఈ తంతుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకవైపు నగరవాసులు నరకం అనుభవిస్తుంటే పనికిమాలిన […]
ఒకవైపు చెన్నై నగరం నరకం అనుభవిస్తుంటే అన్నాడీఎంకే కార్యకర్తలు మాత్రం అమ్మ(జయలలిత) భజన మొదలుపెట్టారు. అమ్మ ది గ్రేట్ అంటూ పోస్టర్లు వేశారు. అంతటితో ఆగి ఉంటే పర్వాలేదు. ఏకంగా బాహుబలిలోని పోస్టర్‌ను మార్పింగ్ చేసి రమ్యకృష్ణ స్థానంలో జయను ఉంచారు. చెన్నై నగరవాసులను అమ్మ కాపాడుతోందంటూ కొటేషన్లు రాశారు. ఇలా ఒక చోట కాదు పలు చోట్ల భారీ పోస్టర్లను అతికించారు. ఈ తంతుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకవైపు నగరవాసులు నరకం అనుభవిస్తుంటే పనికిమాలిన అభిమానం ప్రదర్శిస్తారా అంటూ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.