Telugu Global
NEWS

దానం దాగుడు మూతలు

టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తలను మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఖండించారు. పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికలకు సిద్ధం అవడానికే నగరంలోని వివిధ ప్రాంతాల కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నాని… ఇందులో వేరే అంశం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదని దానం తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత […]

దానం దాగుడు మూతలు
X
టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తలను మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఖండించారు. పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికలకు సిద్ధం అవడానికే నగరంలోని వివిధ ప్రాంతాల కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నాని… ఇందులో వేరే అంశం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదని దానం తెలిపారు.
అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ దానంతో మొదట భేటీ అయ్యారు. ఇద్దరు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధిష్టానం పెద్దలతో ఫోన్లో దానంతో మాట్లాడించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ కూడా దానం కాంగ్రెస్ లోనే ఉంటారని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. దానం కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుడు అని.. ఆయనపై మీడియాలో దుష్ర్పచారం జరుగుతోందన్నారు. దానం సోమవారం టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం చేస్తున్నారని అది తప్పని షబ్బీర్ అలీ అన్నారు. గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దానం పార్టీ నాయకులతో సమావేశం కావడంలో తప్పేంటని ప్రశ్నించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలపైనే స్థానిక నేతలతో దానం చర్చలు జరుపుతున్నారని షబ్బీర్ అలీ అన్నారు.
మొత్తం మీద దానం విషయంలో ఈ ఇద్దరి భేటీలో కూడా దానం దాగుడుమూతలు ఆడారు. తాను పార్టీ మారుతున్నానంటూ మీడియాలో వస్తున్న వార్తలకు సమధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో తన పట్టు నిలుపుకునేందుకే దానం ఇలా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల నాటికి దానం కాంగ్రెస్ లోనే ఉంటారా? లేదా అన్నది చూడాలి మరి.
First Published:  4 Dec 2015 10:36 AM IST
Next Story