ఆయన పిలుస్తారు సరే... ఈయన ఎలా వెళ్తారు?
అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు స్యయంగా వచ్చి ఆహ్వానించడంతో కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పుడు కేసీఆర్ చండీయాగానికి శ్రీకారం చుట్టారు. తాను కూడా చంద్రబాబు ఇంటికి వెళ్లి స్వయంగా యాగానికి ఆహ్వానిస్తానని చెబుతున్నారు. ఈ విషయం మొన్నటి వరకు ఎవరిని పెద్దగా ఆశ్చర్యపరచలేదు. కానీ గురువారం నాటితో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సాయన్నను కేసీఆర్ కారు ఎక్కించుకున్నారు. అంతటితో ఆగలేదు టీడీపీ నుంచి మరింత మంది కారెక్కుతారని టీఆర్ఎస్ మంత్రులు స్వయంగా […]
అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు స్యయంగా వచ్చి ఆహ్వానించడంతో కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పుడు కేసీఆర్ చండీయాగానికి శ్రీకారం చుట్టారు. తాను కూడా చంద్రబాబు ఇంటికి వెళ్లి స్వయంగా యాగానికి ఆహ్వానిస్తానని చెబుతున్నారు. ఈ విషయం మొన్నటి వరకు ఎవరిని పెద్దగా ఆశ్చర్యపరచలేదు. కానీ గురువారం నాటితో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సాయన్నను కేసీఆర్ కారు ఎక్కించుకున్నారు. అంతటితో ఆగలేదు టీడీపీ నుంచి మరింత మంది కారెక్కుతారని టీఆర్ఎస్ మంత్రులు స్వయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యాగానికి కేసీఆర్ పిలిచినా చంద్రబాబు ఎలా వెళ్తారన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.
Click to Read: ఆ కారణంలో భార్యకు విడాకులు కుదరదు: సుప్రీం
వలసల ఆటలో ప్రస్తుతం కేసీఆర్‌దే పైచేయి కాబట్టి ఆయన తప్పకుండా వచ్చి చంద్రబాబును ఆహ్వానిస్తారని అంటున్నారు. కానీ చంద్రబాబు వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లాగేస్తున్నా మౌనంగా యాగానికి వెళ్తే కేసీఆర్‌కు చంద్రబాబు సరెండర్ అయిపోయారన్న భావన బలపడే ప్రమాదం ఉంటుంది. పైగా ఆ మధ్య ఖమ్మం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ పార్టీలో్ చేర్చుకున్న తరుణంలో జగన్ మౌనంగా ఉండడంపై టీడీపీ నేతలు పెద్దెత్తున విమర్శలు చేశారు. జగనే కేసీఆర్‌తో కుమ్మకై ఎమ్మెల్యేలను పంపించారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే సూత్రం తమ నాయకుడికి వర్తిస్తుంది కదాని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. పైగా తెలంగాణలో టీడీపీ అన్నదే లేకుండా చేసేలా కేసీఆర్ ముందుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో చంద్రబాబు యాగానికి హాజరైతే కేడర్ కూడా ఆత్మస్థైర్యం కోల్పోవడం ఖాయమంటున్నారు.
అయితే చంద్రబాబు సన్నిహితులు మాత్రం బాబు సంకటస్థితి గురించి చెబుతున్నారు. చంద్రబాబు పిలవగానే కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యారని… ఇప్పుడు యాగానికి చంద్రబాబు వెళ్లకుంటే సంస్కారం లేదా అంటూ టీఆర్ఎస్ నేతలు ప్రచారం మొదలుపెడుతారని అంచనా వేస్తున్నారు. కాబట్టి తమ నేతకు పెద్ద సంకటస్థితి ఏర్పడిందంటున్నారు. అయినా యాగం డిసెంబర్ 23న కదా అప్పటికి వలసల వార్తలు ఆగిపోతాయని ఆ సమయంలో అలా వెళ్లి వస్తే సరిపోతుందని మరికొందరు నేతలు మీడియా లెక్కలేస్తున్నారు.
Click to Read: When KCR’s best friend meets KCR’s worst enemy!