Telugu Global
National

చెన్నైకి అంతర్జాతీయ సాయం

చెన్నై మహానగరాన్ని ముంచెత్తిన భారీ వరదలకు జన జీవనం అస్తవ్యస్తం అయింది. వరదల భారినపడి ఇప్పటిరకు 269మంది మరణించినట్టు కేంద్రహోంశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారు. అయితే అనధికారికంగా ఈ సంఖ్య 400 వరకు ఉంటుందని అంచనా. వర్షం తగ్గుముఖం పట్టినా ఇంకా వరద ముంపులోనే చెన్నై వీధులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వంతోపాటు కేంద్రం రక్షణ దళాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. మరోవైపు చెన్నైలో వర్షాలు, వరదల వల్ల అతలాకుతలమైన ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవడానికి అమెరికా […]

చెన్నైకి అంతర్జాతీయ సాయం
X
చెన్నై మహానగరాన్ని ముంచెత్తిన భారీ వరదలకు జన జీవనం అస్తవ్యస్తం అయింది. వరదల భారినపడి ఇప్పటిరకు 269మంది మరణించినట్టు కేంద్రహోంశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారు. అయితే అనధికారికంగా ఈ సంఖ్య 400 వరకు ఉంటుందని అంచనా. వర్షం తగ్గుముఖం పట్టినా ఇంకా వరద ముంపులోనే చెన్నై వీధులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వంతోపాటు కేంద్రం రక్షణ దళాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
మరోవైపు చెన్నైలో వర్షాలు, వరదల వల్ల అతలాకుతలమైన ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవడానికి అమెరికా కూడా సిద్ధమని ప్రకటించింది. చెన్నై వరదల గురించి తెలుసుకున్నామని అవసరమైన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. చెన్నైలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు భారత అధికారుల నుంచి తెలుసుకుంటున్నట్టు అమెరికా అధికారి మార్క్ టోనర్ తెలిపారు.
ప్రముఖ సెర్చి ఇంజన్ గూగుల్ కూడా సాంకేతిక పరంగా తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ‘సౌత్ ఇండియా ఫ్లడ్డింగ్’ పేరుతో గూగుల్ తయారు చేసిన టూల్‌ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఎమర్జన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లు, ముంపునకు గురైన ప్రాంతాల వివరాలు, ఇతర ముఖ్య సమాచారం ఇందులో ఉంది. గూగుల్ టూల్‌ http://google.org/crisisresponse/2015-chennai-flooding ఈ లింక్ ద్వారా సందర్శించవచ్చు.
First Published:  4 Dec 2015 9:32 AM IST
Next Story