టీఆర్‌ఎస్ నేతలతో దానం భేటీ- కాంగ్రెస్ ప్రతివ్యూహం
జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు పెద్ద షాకే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. అందరూ అనుకుంటున్నట్టుగానే గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ టీఆర్‌ఎస్ వైపు అడుగులేస్తున్నారు. రాత్రి అర్ధరాత్రి వరకు టీఆర్ఎస్ నేత డీఎస్ నివాసంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో దానం సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీలో చేరితే తనకు కల్పించే ప్రాధాన్యతపై చర్చించారు. టీఆర్‌ఎస్ నేతలతో చర్చల అనంతరం ఉదయం తన అనుచరులతో దానం భేటీ అయ్యారు. రెండుమూడు రోజుల్లో దానం టీఆర్ఎస్‌లో చేరడం […]
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు పెద్ద షాకే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. అందరూ అనుకుంటున్నట్టుగానే గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ టీఆర్‌ఎస్ వైపు అడుగులేస్తున్నారు. రాత్రి అర్ధరాత్రి వరకు టీఆర్ఎస్ నేత డీఎస్ నివాసంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో దానం సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీలో చేరితే తనకు కల్పించే ప్రాధాన్యతపై చర్చించారు. టీఆర్‌ఎస్ నేతలతో చర్చల అనంతరం ఉదయం తన అనుచరులతో దానం భేటీ అయ్యారు. రెండుమూడు రోజుల్లో దానం టీఆర్ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది.
Click to Read: ఆయన పిలుస్తారు సరే… ఈయన ఎలా వెళ్తారు?
మరోవైపు దానం నాగేందర్ పార్టీ మారుతారన్న దానిపై చాలా రోజుల క్రితమే కాంగ్రెస్ నేతలు ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే వెంటనే పార్టీ మారకుండా తీరా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమైన సమయంలో పార్టీ వీడడం ద్వారా కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ నేతలతో కలిసి దానం పథకరచన చేశారని హస్తం నేతలు అనుమానిస్తున్నారు. అందుకే పీసీసీ పెద్దలు దానంకు అల్లిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది. పార్టీలో ఉంటారా లేదా అన్న దానిపై రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వాలని దానంకు పీసీసీ అల్టిమేటం ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఒక వేళ దానం పార్టీ వీడితే జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా మరొకరికి గ్రేటర్ నాయకత్వం అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అయితే డీఎస్‌తో దానం భేటి గురించి తెలుసుకున్న షబ్బీర్ అలీ దానం ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దానం కాంగ్రెస్ వ్యక్తి అని పార్టీ వీడబోరని షబ్బీర్ ధీమా వ్యక్తం చేశారు. దానంపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
Click to Read: When KCR’s best friend meets KCR’s worst enemy!