Telugu Global
Others

మోదీకి ఎంత చిరాకో!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడమే అపురూపం. తన మాటే చెల్లాలనే తత్వం మోదీది. కాని దురదృష్టవశాత్తు పార్లమెంటులో భిన్నాభిప్రాయాల వారు ఉన్నారు. విద్వేషాన్ని, అసహనాన్ని సహించలేని వారూ ఉంటారు. వారి అభిప్రాయాలు వినే ఓపిక ప్రధాన మంత్రికి తక్కువ. బుధవారం నాడు లోక్‌సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ.కె. సింగ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాల వారు పట్టుబట్టారు. వీ.కె. సింగ్ దళితుల మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు కనక ఆయన […]

మోదీకి ఎంత చిరాకో!
X

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడమే అపురూపం. తన మాటే చెల్లాలనే తత్వం మోదీది. కాని దురదృష్టవశాత్తు పార్లమెంటులో భిన్నాభిప్రాయాల వారు ఉన్నారు. విద్వేషాన్ని, అసహనాన్ని సహించలేని వారూ ఉంటారు. వారి అభిప్రాయాలు వినే ఓపిక ప్రధాన మంత్రికి తక్కువ.
బుధవారం నాడు లోక్‌సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ.కె. సింగ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాల వారు పట్టుబట్టారు. వీ.కె. సింగ్ దళితుల మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు కనక ఆయన మంత్రిగా కొనసాగడానికి వీలు లేదని ప్రతిపక్ష సభ్యులు బుధవారం నాడు లోక్‌ సభలో ప్రశ్నోత్తరార్ల సమయం ప్రారంభం కాగానే స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి గట్టిగా కోరారు. శాంతించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంతగా విజ్ఞప్తి చేసినా ప్రతిపక్షాల వారు శాంతించలేదు. వీ.కె.సింగ్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల వారు నినాదాలు చేశారు.
ఈ గొడవ జరుగుతున్నంత సేపూ ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా మొదటి వరసల్లో మౌనంగా కూర్చున్నారు. గొడవ మధ్యలోనే ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. సభ కొనసాగించడానికి సహకరించాలని స్పీకర్ చేసిన విజ్ఞప్తిని పట్టించుకోకుండా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఈ తతంగం అంతా గమనిస్తూ కూర్చున్న ప్రధాని మోదీ చిరాకు పడి సభ నుంచి నిష్క్ర మించారు. చిరాకు కాదు కావాల్సింది అవమానకరంగా మాట్లాడే మంత్రులపై చర్య. దానికి మాత్రం బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు.

First Published:  3 Dec 2015 7:27 AM IST
Next Story