పవన్- కాజల్ రోమాన్స్ అదుర్స్
కుటుంబ కథా చిత్రాలు నటించడంలో పవన్ ముందుంటాడు. తన చిత్రాలను అన్ని వర్గాల వారు చూడాలన్నది అతని అభిమతం. అస్సలు పవన్ పేరు చెబితేనే గుర్తొచ్చేవి.. డైలాగులు, మంచి కథ, వెరైటీ కాస్ట్యూమ్స్, చిన్న చిన్న డాన్సు స్టెప్పులు. ఇంతవరకూ పవన్ ఏ సినిమాలోనూ రొమాంటిక్ సన్నివేశాలు చేసింది లేదు. అప్పుడెప్పుడో బద్రీ సినిమాలో అమీషా పటేల్‌తో రొమాన్స్ చేసినా.. అది కొద్దిసేపే! ఆ తరువాత అలాంటి సన్నివేశాల దరిదాపులకు కూడా పోలేదు. మరి ఇంతకాలం విరామం తరువాత […]
BY sarvi3 Dec 2015 8:30 AM IST
X
sarvi Updated On: 3 Dec 2015 8:54 AM IST
కుటుంబ కథా చిత్రాలు నటించడంలో పవన్ ముందుంటాడు. తన చిత్రాలను అన్ని వర్గాల వారు చూడాలన్నది అతని అభిమతం. అస్సలు పవన్ పేరు చెబితేనే గుర్తొచ్చేవి.. డైలాగులు, మంచి కథ, వెరైటీ కాస్ట్యూమ్స్, చిన్న చిన్న డాన్సు స్టెప్పులు. ఇంతవరకూ పవన్ ఏ సినిమాలోనూ రొమాంటిక్ సన్నివేశాలు చేసింది లేదు. అప్పుడెప్పుడో బద్రీ సినిమాలో అమీషా పటేల్‌తో రొమాన్స్ చేసినా.. అది కొద్దిసేపే! ఆ తరువాత అలాంటి సన్నివేశాల దరిదాపులకు కూడా పోలేదు. మరి ఇంతకాలం విరామం తరువాత పవన్ మళ్లీ రొమాంటిక్ సన్నివేశాలలో మునిగిపోయాడట.
సర్దార్ గబ్బర్‌లో..
పవన్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్‌లో కాజల్ నటిస్తున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఓ రొమాంటిక్ పాట చిత్రీకరిస్తున్నాడట దర్శకుడు బాబీ. దేవీ శ్రీ అందించిన మెలోడీ బాణీకి తగినట్లుగా అందమైన సెట్టింగుల్లో షూటింగ్ కానిస్తున్నాడు బాబీ. అయితే, ఈ పాటలో ఉన్న సందర్భం ప్రకారం.. పవన్- కాజల్ మధ్య ఘాటైన సన్నివేశాలు ఉన్నాయని, వాటిల్లో వీరిద్దరూ మంచి కెమిస్ట్రీతో నటించారని చిత్ర యూనిట్ సభ్యులు చెవులు కొరుక్కుంటున్నారు. రషెష్ చూసిన పవన్ కూడా నాలో ఇంతటి రొమాంటిక్ యాటిట్యుడ్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోయాడని తెలిసింది. మరి వీరిద్దరూ రొమాన్స్ ఎంతమేరకు పండించారో చూడాలంటే మార్చి దాకా ఆగాల్సిందే!
Next Story