వరద విరాళాలకు రజనీ దెబ్బ
తమిళనాడు వరదల బారినపడి అతలాకుతలం అయింది. అక్కడి పరిస్థితి చూసిన ప్రతి ఒక్కరి మనసు కదిలిపోతోంది. పక్క రాష్ట్రం అయినప్పటికి మన తెలుగు హీరోలు వెంటనే స్పందించి భారీగా విరాళాలు ప్రకటించారు. అల్లు అర్జున్ 25 లక్షలు, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లు చెరో 10 లక్షలు ప్రకటించారు. కల్యాణ్‌రామ్ 5 లక్షలు ఇచ్చారు. చివరకు సంపూర్ణేశ్‌బాబు కూడా అందరికంటే ముందుగానే స్పందించి 50 వేలు ఇచ్చారు. పక్క రాష్ట్రానికి చెందిన మన హీరోలు ఇంత మొత్తంలో విరాళం ఇస్తే […]
తమిళనాడు వరదల బారినపడి అతలాకుతలం అయింది. అక్కడి పరిస్థితి చూసిన ప్రతి ఒక్కరి మనసు కదిలిపోతోంది. పక్క రాష్ట్రం అయినప్పటికి మన తెలుగు హీరోలు వెంటనే స్పందించి భారీగా విరాళాలు ప్రకటించారు. అల్లు అర్జున్ 25 లక్షలు, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లు చెరో 10 లక్షలు ప్రకటించారు. కల్యాణ్‌రామ్ 5 లక్షలు ఇచ్చారు. చివరకు సంపూర్ణేశ్‌బాబు కూడా అందరికంటే ముందుగానే స్పందించి 50 వేలు ఇచ్చారు. పక్క రాష్ట్రానికి చెందిన మన హీరోలు ఇంత మొత్తంలో విరాళం ఇస్తే ఇక తమిళనాడుకు చెందిన హీరోలు ఇంకేస్థాయిలో విరాళాలు ఇచ్చి ఉండాలి.
కానీ అలా ఏమీ జరగలేదు. ఒక్క హీరో సూర్య(25లక్షలు) మినహాయిస్తే మరెవరు ఆస్థాయిలోడబ్బు ఇవ్వలేదు. చాలా మంది తమిళహీరోలు రూ. 5లక్షలతో సరిపెట్టారు. ప్రాంతీయ అభిమానం అధికంగా ఉండే తమిళనాడులో ఉన్న హీరోలే ఇలా చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే ఇలా చాలామంది తమిళ నటులు తక్కువ విరాళం ఇవ్వడానికి కారణం రజనీకాంతేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరదపై స్పందించిన రజనీకాంత్ కేవలం రూ. 10 లక్షల సాయం ప్రకటించారు. దీంతో చాలా మంది నటులు రజనీ ఇచ్చిన విరాళం ఫిగర్ దాటేందుకు సాహసించడం లేదు.
రజనీ ఇచ్చిన దాని కన్నా అధికంగా ఇస్తే అతడిని కించపరిచినట్టు అవుతుందని భావిస్తున్నారు. అందుకే హీరో ధనుష్ కూడా కేవలం రూ. 5 లక్షలు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ప్రభు సైతం రూ. 5లక్షలతో సరిపెట్టారు. అక్కడి యాక్టర్ల తీరు చూసి జనం కూడా ఆశ్చర్యపోతున్నారు. తెలుగు రాష్ట్రానికి చెందిన హీరోలు పాతిక లక్షలు, పది లక్షలు ఇస్తుంటే తమిళజనం మీద కోట్లు సంపాదిస్తున్న స్థానిక హీరోలు ఇలా ఐదు లక్షలు ప్రకటించడం అవమానంగా ఉందంటున్నారు.. రజనీకాంత్ అభిమానులు కూడా మరింత ఎక్కువ మొత్తంలో తమ హీరో విరాళం ప్రకటించాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలోనూ రజనీపై పంచ్‌లు పేలుతున్నాయి. బాషా పది పక్షలు ఇస్తే వంద లక్షలు ఇచ్చినట్టే అని సెటైర్లు వేస్తున్నారు.