Telugu Global
Others

భారత్‌పై అణుదాడికి అప్పుడే సిద్ధపడ్డ పాక్

కార్గిల్ యుద్ధ సమయం నాటి కీలక అంశం వెలుగులోకి వచ్చింది. కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ సైన్యాన్ని నేరుగా ఎదుర్కోవడం చేతగాదని నిర్ధారించుకున్న పాక్‌ బరి తెగించేందుకు సిద్ధమైందట. ఏకంగా భారత్‌పై అణుబాంబులు ప్రయోగించేందుకు సిద్ధపడిందని అమెరికా వైట్ హౌజ్‌ మాజీ ఉన్నతాధికారి రీడెల్ బయటపెట్టారు. అయితే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా విషయం తెలుసుకున్న అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ వార్నింగ్‌ ఇవ్వడంతో పాకిస్తాన్ అణుబాంబుల విషయంలో వెనుక్కు తగ్గిందని వెల్లడించారు. కార్గిల్ యుద్ధంలో భారత్‌ చేతితో […]

భారత్‌పై అణుదాడికి అప్పుడే సిద్ధపడ్డ పాక్
X

కార్గిల్ యుద్ధ సమయం నాటి కీలక అంశం వెలుగులోకి వచ్చింది. కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ సైన్యాన్ని నేరుగా ఎదుర్కోవడం చేతగాదని నిర్ధారించుకున్న పాక్‌ బరి తెగించేందుకు సిద్ధమైందట. ఏకంగా భారత్‌పై అణుబాంబులు ప్రయోగించేందుకు సిద్ధపడిందని అమెరికా వైట్ హౌజ్‌ మాజీ ఉన్నతాధికారి రీడెల్ బయటపెట్టారు. అయితే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా విషయం తెలుసుకున్న అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ వార్నింగ్‌ ఇవ్వడంతో పాకిస్తాన్ అణుబాంబుల విషయంలో వెనుక్కు తగ్గిందని వెల్లడించారు. కార్గిల్ యుద్ధంలో భారత్‌ చేతితో ఓటమి ఖాయమైన దశలో ఈ దుశ్చర్యకు పాక్ సిద్ధమైంది.

1999 జులై 4న అప్పటి అమెరికా అధ్యక్షుడి బిల్ క్లింటన్‌కు CIA రోజువారి నివేదికను పంపింది. ఆ సమయంలో పాక్ దుష్ట ఆలోచన అధ్యక్షుడికి తెలిసిందని రీడెల్ చెప్పారు. వెంటనే ఈ విషయంలో పాక్‌ ప్రభుత్వాన్ని బిల్‌ క్లింటన్ నిలదీశారని వెల్లడించారు. అమెరికా నుంచి ఒత్తిడి రావడం, అణ్వాయుధాలు ప్రయోగిస్తే ప్రపంచం ముందు నేరస్తుల్లా నిలబడాల్సి వస్తుందన్న భయంతో చివరకు నవాజ్ షరీఫ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని వైట్‌ హౌజ్ మాజీ ఉన్నతాధికారి రీలెడ్ బయటపెట్టారు. ఆ తర్వాత క్లింటన్‌ను కలిసిన షరీఫ్ యుద్ధానికి ముగింపు పలికేందుకు సాయం కోరారు. యుద్ధానికి కారణం పాకిస్తాన్ కాబట్టి, పాకిస్తానే బలగాలను వెనక్కి పిలిపించాలని క్లింటన్ తేల్చిచెప్పారని.. దాంతో మరో దారి లేక షరీఫ్ సైన్యాన్ని వెనక్కు రప్పించేందుకు ఒప్పుకున్నారని రీలెడ్‌ వెల్లడించారు.

First Published:  3 Dec 2015 8:46 AM IST
Next Story