గ్రేటర్ ఎన్నికల వేళ మరో అస్త్రాన్ని సంధించిన కేసీఆర్
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేసీఆర్ మరో అస్త్రాన్ని సంధించారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్, నల్లా బిల్లులు రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. విద్యుత్ పెండింగ్ బిల్లుల రద్దు వల్ల దాదాపు 6 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది 50 నుంచి 100 యూనిట్ల విద్యుత్ వాడుతున్న వారే. నల్లా బకాయిలు రద్దుతో మూడు లక్షల కుటుంబాలకు ఊరట లభించనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ఈ నిర్ణయాన్ని అధికారికంగా […]
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేసీఆర్ మరో అస్త్రాన్ని సంధించారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్, నల్లా బిల్లులు రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. విద్యుత్ పెండింగ్ బిల్లుల రద్దు వల్ల దాదాపు 6 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది 50 నుంచి 100 యూనిట్ల విద్యుత్ వాడుతున్న వారే. నల్లా బకాయిలు రద్దుతో మూడు లక్షల కుటుంబాలకు ఊరట లభించనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదని అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగానే బకాయిల రద్దు పథకం ప్రకటించనున్నారు.