Telugu Global
Others

టీడీపీకి షాక్‌- కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ

తెలంగాణ టీడీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లగా తాజాగా మరికొందరు ఆ దారిలో పయణిస్తున్నారు. కంటోన్మెంటు టీడీపీ ఎమ్మెల్యే సాయన్న సీఎం కేసీఆర్‌ను క్యాంపు ఆఫీస్‌లో కలిశారు. మంత్రి హరీష్‌రావు స్వయంగా సాయన్నను కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్లారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్‌గా కూడా ఉన్న సాయన్న ఇక టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు కూడా. సాయన్నతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా కేసీఆర్‌ను కలిశారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం […]

టీడీపీకి షాక్‌- కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ
X

తెలంగాణ టీడీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లగా తాజాగా మరికొందరు ఆ దారిలో పయణిస్తున్నారు. కంటోన్మెంటు టీడీపీ ఎమ్మెల్యే సాయన్న సీఎం కేసీఆర్‌ను క్యాంపు ఆఫీస్‌లో కలిశారు. మంత్రి హరీష్‌రావు స్వయంగా సాయన్నను కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్లారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్‌గా కూడా ఉన్న సాయన్న ఇక టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు కూడా. సాయన్నతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా కేసీఆర్‌ను కలిశారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్‌కు ప్రభాకర్ ముఖ్య అనుచరుడు కావడం విశేషం.

సాయన్నతో పాటు మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్‌లో చేరుతారని సమాచారం. వీరిలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపధ్యంలో 100కు తగ్గకుండా వార్డులను సొంతం చేసుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఇదే అంశంపై పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పార్టీలోకి అందరిని కాకుండా జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం చేకూర్చే నేతలను మాత్రమే ఆహ్వానించాలని నిర్ణయించారు. దానం నాగేందర్ పేరు కూడా పార్టీ మారే వారి జాబితాలో ప్రముఖంగానే వినిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి, స‌న‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు, ఇబ్ర‌హీం ప‌ట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డిలు గులాబీ గూటికి చేరారు. సాయన్న, ప్రకాశ్‌ గౌడ్‌ కూడా చేరితే ఆ సంఖ్య ఆరుకు చేరనుంది.

First Published:  3 Dec 2015 8:35 AM IST
Next Story