Telugu Global
NEWS

దానంపై చ‌ర్య‌కు సాహ‌సిస్తారా?

మాజీ మంత్రి, గ్రేట‌ర్ హైద‌రాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు దానం నాగేంద‌ర్ పీఠం కింద‌కు నీళ్లు వచ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. ముఖ్యంగా కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ముంచుకొచ్చిన ఈ త‌రుణంలో ఆయ‌న అనుస‌రిస్తున్న వైఖ‌రి కొద్దిమంది ముఖ్య‌నేత‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. పార్టీలో క్రియాశీలకంగా వ్య‌వ‌హ‌రించ‌డంలేద‌ని వారు ఇప్ప‌టికే దానం నాగేంద‌ర్‌పై అధిష్టానానికి ఫిర్యాదులు పంపించిన‌ట్లు తెలుస్తోంది. వైఖ‌రి మార్చుకుంటావా లేదా అని ఆయ‌న‌నే స్వ‌యంగా అడిగి తేల్చుకోవాల‌ని కొంద‌రు సీనియ‌ర్లు సిద్ధ‌మౌతున్నార‌ని కూడా వినిపిస్తోంది. గురువారం గాంధీభ‌వ‌న్‌లో జ‌ర‌గ‌నున్న […]

దానంపై చ‌ర్య‌కు సాహ‌సిస్తారా?
X
మాజీ మంత్రి, గ్రేట‌ర్ హైద‌రాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు దానం నాగేంద‌ర్ పీఠం కింద‌కు నీళ్లు వచ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. ముఖ్యంగా కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ముంచుకొచ్చిన ఈ త‌రుణంలో ఆయ‌న అనుస‌రిస్తున్న వైఖ‌రి కొద్దిమంది ముఖ్య‌నేత‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. పార్టీలో క్రియాశీలకంగా వ్య‌వ‌హ‌రించ‌డంలేద‌ని వారు ఇప్ప‌టికే దానం నాగేంద‌ర్‌పై అధిష్టానానికి ఫిర్యాదులు పంపించిన‌ట్లు తెలుస్తోంది. వైఖ‌రి మార్చుకుంటావా లేదా అని ఆయ‌న‌నే స్వ‌యంగా అడిగి తేల్చుకోవాల‌ని కొంద‌రు సీనియ‌ర్లు సిద్ధ‌మౌతున్నార‌ని కూడా వినిపిస్తోంది. గురువారం గాంధీభ‌వ‌న్‌లో జ‌ర‌గ‌నున్న టీ కాంగ్రెస్ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో దానం నాగేంద‌ర్‌కు పార్టీ సీనియ‌ర్ల నుంచి ఈ త‌ర‌హా ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలంటున్నాయి. దానం తీరుపైనే ప్ర‌ధానంగా చ‌ర్చ ఉంటుంద‌ని కూడా వినిపిస్తోంది. త‌న వైఖ‌రిపై స‌రైన వివ‌ర‌ణ ఇవ్వ‌లేక‌పోతే దానంను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని టీపీసీసీ నేత‌లు ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌ని దానం ముందునుంచీ ఊహిస్తున్నార‌ని, అందుకు ఆయ‌న త‌గిన విధంగా సిద్ధ‌మ‌య్యే ఉన్నార‌ని ఆయ‌న స‌న్నిహ‌తులు అంటున్నారు. నిజానికి దానం పార్టీ మార‌నున్నార‌ని కూడా ఒక ద‌శ‌లో వినిపించింది. అందుకే ఆయ‌న పార్టీ వ్య‌వ‌హారాల‌లో అంటీముట్ట‌న‌ట్టు ఉంటున్నారు. వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీపై చాలామందికి ఉన్న భ్ర‌మ‌లు పూర్తిగా తొల‌గిపోయాయి. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పార్టీని గ‌ట్టెక్కించాలంటే ఏం చేయాల‌న్న దానిపై సీనియ‌ర్లెవరి వ‌ద్దా ఎలాంటి ప‌రిష్కారాలూ లేవు. ఈ ద‌శ‌లో దానం వంటి గ‌ట్టి నాయ‌కుడిపై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌డం అంటే కొరివితో త‌ల గోక్కున్నట్టే.
First Published:  2 Dec 2015 1:05 PM IST
Next Story