ఉమా మాధవరెడ్డి వర్సెస్ మోత్కుపల్లి
అసలే పార్టీ పరిస్థితి అంతంతమాత్రం. ఆపైన నాయకుల మధ్య విభేదాలు. అధినేత ముందు అంతా కలిసి పనిచేస్తామని బీరాలు పలుకుతారు. అలా బయటకు వచ్చారో లేదో.. ఒకరి గోతులు మరొకరు తవ్వుకుంటారు. ఇదీ ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి. ఇప్పుడు నల్గొండ జిల్లా టీడీపీ నాయకుల్లో కొత్త జిల్లాల ఏర్పాట్లు చిచ్చు పెట్టింది. సీనియర్ నేతలు మోత్కుపల్లి, ఉమా మాధవరెడ్డి చెరో వర్గంగా విడిపోయారు. యాదగిరిగుట్టను జిల్లా చేయాలని మోత్కుపల్లి నరసింహులు యాదాద్రిలో ఒకరోజు […]
BY sarvi2 Dec 2015 9:32 AM IST
X
sarvi Updated On: 3 Dec 2015 4:30 AM IST
అసలే పార్టీ పరిస్థితి అంతంతమాత్రం. ఆపైన నాయకుల మధ్య విభేదాలు. అధినేత ముందు అంతా కలిసి పనిచేస్తామని బీరాలు పలుకుతారు. అలా బయటకు వచ్చారో లేదో.. ఒకరి గోతులు మరొకరు తవ్వుకుంటారు. ఇదీ ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి. ఇప్పుడు నల్గొండ జిల్లా టీడీపీ నాయకుల్లో కొత్త జిల్లాల ఏర్పాట్లు చిచ్చు పెట్టింది. సీనియర్ నేతలు మోత్కుపల్లి, ఉమా మాధవరెడ్డి చెరో వర్గంగా విడిపోయారు.
యాదగిరిగుట్టను జిల్లా చేయాలని మోత్కుపల్లి నరసింహులు యాదాద్రిలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. మోత్కుపల్లి దీక్షకు పార్టీ నేతలు మద్దుతు పలికారు. మరోవైపు మోత్కుపల్లికి ఝలక్ ఇస్తూ మరో సీనియర్ నేత ఉమామాధవరెడ్డి మరో డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న భువనగిరిని జిల్లాగా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కొందరు సొంత ప్రయోజనాలకోసం జిల్లా డిమాండ్లను తీసుకువస్తున్నారని ఉమా మాధవరెడ్డి విమర్శించారు.
జిల్లాలో ఒకేరోజు ఇద్దరు సీనియర్ నేతలు చెరో వైపు ఉండి మాటలకు దిగడంతో రాజకీయంగా దుమారం రేగింది. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగిన విషయం తెలుసు. చివరికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కల్పించుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. పార్టీ పటిష్టత కోసం బాబు ప్రయత్నిస్తుంటే నేతలు మాత్రం ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ పరిస్థితుల్లో నాయకులంతా ఐక్యంగా ఉండాల్సింది పోయి సొంత ఎజెండాతో ముందుకు వెళ్తుండడంపై ఎన్టీఆర్ భవన్ లో కలవరం మొదలైంది. ఇప్పుడు కూడా అధినేత ఇద్దర్ని పిలిచి మాట్లాడతారా? లేక ఎవరిదారిన వారిని వదిలేస్తారా? అన్నదానిపై పార్టీలో చర్చ నడుస్తోంది.
Next Story