Telugu Global
Others

నీకేందిరా చెప్పేది..! రే బచ్చా.! నాలుగు తగిలిస్తా!

నేతలు తమ స్థాయిని మరిచిపోతున్నారు. తిట్టుకోవడమే స్టేటస్ సింబల్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ నేత మందాజగన్నాథం తీవ్రస్థాయిలో తిట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు  హైదరాబాద్‌ శివారులోని అత్తాపూర్ క్లబ్‌ హౌజ్‌లో జరిగిన టీఆర్‌ఎస్ సమీక్ష సమావేశంలో ఈ ఘటన జరిగింది. ఈ సమావేశానికి గువ్వల, మందా ఇద్దరూ హాజరయ్యారు. అయితే తన నియోజకవర్గానికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వస్తున్నారని… తాను వెళ్తానంటూ సమావేశం […]

నీకేందిరా చెప్పేది..! రే బచ్చా.! నాలుగు తగిలిస్తా!
X

నేతలు తమ స్థాయిని మరిచిపోతున్నారు. తిట్టుకోవడమే స్టేటస్ సింబల్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ నేత మందాజగన్నాథం తీవ్రస్థాయిలో తిట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు హైదరాబాద్‌ శివారులోని అత్తాపూర్ క్లబ్‌ హౌజ్‌లో జరిగిన టీఆర్‌ఎస్ సమీక్ష సమావేశంలో ఈ ఘటన జరిగింది.

ఈ సమావేశానికి గువ్వల, మందా ఇద్దరూ హాజరయ్యారు. అయితే తన నియోజకవర్గానికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వస్తున్నారని… తాను వెళ్తానంటూ సమావేశం మధ్యలో ఎమ్మెల్యే బాలరాజు పైకి లేచారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న మందా జగన్నాథం ”నేను నాగర్ కర్నూలు లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్నాను.. మంత్రి వస్తుంటే నాకెందుకు సమాచారం ఇవ్వలేదు. ఇలా చాలాసార్లు జరుగుతోంది. నా నియోజకర్గ పరిధిలో జరిగే కార్యక్రమాల సమాచారం నాకు ఇవ్వడం లేదు. నేనూ టీఆర్‌ఎస్‌లోనే ఉన్నాను కదా! ” అంటూ నిలదీశారు. దీంతో సమావేశం నుంచి బయటకు వెళ్తున్న గువ్వల బాలరాజు వెనక్కు వచ్చి ”వస్తానంటే పోదాంపా.. తోలుకుని పోతా” అని అన్నారు. అంతే మందాకు కోపం వచ్చింది.

”నువ్వు తోలుకపోతానంటే నేను రావాలా. అలా రావడానికి నేను బిచ్చగాన్నా. సీనియర్‌ నేతను. పదేళ్లు ఎంపీగా చేశా” అంటూ మందా ఫైర్ అయ్యారు. అయితే గువ్వల బాలరాజు కూడా అంతే స్థాయిలో రియాక్ట్‌ అయ్యారు. ”నీకేందిరా ముందుగా చెప్పేది. నాలుగు తగిలిస్తా” అంటూ ఊగిపోయారు. ఇలా ఒకరినొకరు తిట్టుకున్నారు. కొట్టుకుంటారా అనే స్థాయిలో ఒకరి మీదకు మరొకరు దూసుకెళ్లారు. చివరకు అక్కడే ఉన్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డితో పాటు ఇతర నేతలు జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. గువ్వల బాలరాజు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

First Published:  1 Dec 2015 8:02 PM GMT
Next Story