డిక్టేటర్ తో సోగ్గాడు సై
‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోను జనవరి 13న విడుదల చేయాలని ఎన్టీఆర్ అల్టిమేటం జారీ చేసాడట. సంక్రాంతి సీజన్‌ని మిస్ కాకూడదని ఎన్టీఆర్‌తో సహా నిర్మాత కూడా పట్టు పట్టడంతో స్పెయిన్ షెడ్యూల్ వేగంగా పూర్తి చేయాలని సుకుమార్ కూడా బాగా వర్క్ చేస్తున్నాడట.. ఇప్పటికి సంక్రాంతికే రిలీజ్ వుంటుందనే అంటున్నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద ఇంకా చాలా అనుమానాలున్నాయి.కాబట్టి నాన్నకుప్రేమ తో పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువ అని ఫిలిం నగర్ […]
‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోను జనవరి 13న విడుదల చేయాలని ఎన్టీఆర్ అల్టిమేటం జారీ చేసాడట. సంక్రాంతి సీజన్‌ని మిస్ కాకూడదని ఎన్టీఆర్‌తో సహా నిర్మాత కూడా పట్టు పట్టడంతో స్పెయిన్ షెడ్యూల్ వేగంగా పూర్తి చేయాలని సుకుమార్ కూడా బాగా వర్క్ చేస్తున్నాడట.. ఇప్పటికి సంక్రాంతికే రిలీజ్ వుంటుందనే అంటున్నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద ఇంకా చాలా అనుమానాలున్నాయి.కాబట్టి నాన్నకుప్రేమ తో పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువ అని ఫిలిం నగర్ టాక్. మరోవైపు బాలకృష్ణ డిక్టేటర్ మాత్రం జనవరి 14న ఆరు నూరైనా రిలీజ్ అయిపోతుందట. ఎన్టీఆర్ సినిమా విడుదలైతే ఓకే కానీ లేదంటే తమ చిత్రాలని విడుదల చేయాలని పలువురు రెడీగా వున్నారు. వారిలో నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’తో పాటు శర్వానంద్ సినిమా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కూడా వుంది.
ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే థియేటర్ల పరంగా కొరత వుంటుంది కనుక ‘సోగ్గాడి’ని ఫిబ్రవరికి పుష్ చేయవచ్చు. అదే అది లేదంటే మాత్రం ఈ చిత్రం ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చేస్తుందట. జనవరి 14 లేదా 22న రిలీజ్ చేయడానికి ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాన్ని రెడీ చేస్తున్నారు యువి క్రియేషన్స్ వారు. మొత్తానికి వచ్చే యేడాది ఆరంభంలోనే చాలా చిత్రాలు పోటీ పడుతూ 2016 కాంపిటీటివ్‌గా, కలర్‌ఫుల్‌గా వుంటుందనే సంగతిని చెప్పకనే చెబుతున్నాయి.