Telugu Global
Others

నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు

రాందేవ్ బాబా. ఈ పేరు వినని, తెలియని వారు ఉండరు. యోగా గురువు బాబా రాందేవ్ అందరికీ సుపరిచితమే. ఆయన ఎంత ప్రముఖుడో అప్పుడప్పుడూ ఆయన చేసే వ్యాఖ్యలు కూడా అంతే సంచలనంగా మారుతూ ఉంటాయి. తాజాగా ఓ చానల్ ఇంటర్వ్యూలో రాందేవ్ తనకు సంబంధించిన అనేక వ్యక్తిగత విషయాలను వెల్లడించి ఆశ్చర్య పరిచారు. ఆవే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారాయి. టీవీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఇహపరమైన అన్ని సుఖాలనూ త్యజించి సన్యాసిగా […]

నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు
X
రాందేవ్ బాబా. ఈ పేరు వినని, తెలియని వారు ఉండరు. యోగా గురువు బాబా రాందేవ్ అందరికీ సుపరిచితమే. ఆయన ఎంత ప్రముఖుడో అప్పుడప్పుడూ ఆయన చేసే వ్యాఖ్యలు కూడా అంతే సంచలనంగా మారుతూ ఉంటాయి. తాజాగా ఓ చానల్ ఇంటర్వ్యూలో రాందేవ్ తనకు సంబంధించిన అనేక వ్యక్తిగత విషయాలను వెల్లడించి ఆశ్చర్య పరిచారు. ఆవే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారాయి.
టీవీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఇహపరమైన అన్ని సుఖాలనూ త్యజించి సన్యాసిగా మారానని.. ఇప్పుడు తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని చెప్పిన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. అదే సమయంలో తాను సన్యాసిగా మారిన తర్వాత కూడా ఎంతో మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారని రాందేవ్ బాబా చెప్పారు. మరో ఆసక్తికర సంఘటనను కూడా బాబా వెల్లడించారు. ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న తన దగ్గరకు ప్రముఖ సినీ నటివచ్చి తన మనసులోని కోరిక వెల్లడించిందని.. ఆమె మాటలు వినగానే తాను పారిపోయానని చెప్పారు. అయితే ఆ నటి పేరు మాత్రం రామ్‌దేవ్ చెప్పలేదు. ఇక అమెరికా పర్యటనలో ఉన్నపుడు కూడా ఓ మహిళ తన వద్దకు వచ్చి ఏకాంతంగా మాట్లాడాలని కోరిందని, తన సర్వస్వాన్ని అర్పిస్తానని ప్రాధేయపడిందని, తాను మాత్రం అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయానని అన్నారు.
ఇక భారత్ లో మత అసహనం అన్న పదానికి తావులేదని రాందేవ్ అన్నారు. భారతీయులు ఎంతో సహనశీలురని మత అసహనం అన్న పదాన్ని విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం సృష్టించాయన్నారు. ఒకవేళ అసహనం ఉంటే అమీర్ ఖాన్, కిరణ్ రావు ఎలా కలిశారని, వారి వివాహం జరిగి ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో నల్లధనం పెరిగిందని దాన్ని వెనక్కు తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని.. ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు తప్పు పట్టాల్సిన అవసరం లేదని, సమయం వస్తే, నల్లధనంపై తాను కూడా పోరాడతాన్నారు.
First Published:  2 Dec 2015 5:57 AM IST
Next Story