అన్నా... నీ అంతిమయాత్రకు ఇంకేం చేయగలను?
నెల్లూరు జిల్లాలో ఇద్దరు అన్నదమ్ముల పరిస్థితి అందరినీ కలిచివేసింది. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగి… బతుకుదెరువులోనూ కలిసే పని చేసిన అన్నదమ్ములను చావు వేరు చేసింది. అన్న అంతిమయాత్ర కోసం తమ్ముడు ఎదుర్కొన్న దీన స్థితి కన్నీరు పెట్టించింది. తమిళనాడు మధురై ప్రాంతానికి చెందిన కెంపురాజు, గోవిందరాజు దుప్పట్లు విక్రయించి జీవనం సాగించేవారు. అలా ఇటీవల నెల్లూరుజిల్లా కలువాయికి వచ్చారు. కానీ మంగళవారం గుండెపోటుతో 71 ఏళ్ల అన్న కెంపురాజు కన్నుమూశారు. దీంతో గోవింద్‌రాజ్ బోరున విలపించారు. […]
నెల్లూరు జిల్లాలో ఇద్దరు అన్నదమ్ముల పరిస్థితి అందరినీ కలిచివేసింది. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగి… బతుకుదెరువులోనూ కలిసే పని చేసిన అన్నదమ్ములను చావు వేరు చేసింది. అన్న అంతిమయాత్ర కోసం తమ్ముడు ఎదుర్కొన్న దీన స్థితి కన్నీరు పెట్టించింది. తమిళనాడు మధురై ప్రాంతానికి చెందిన కెంపురాజు, గోవిందరాజు దుప్పట్లు విక్రయించి జీవనం సాగించేవారు. అలా ఇటీవల నెల్లూరుజిల్లా కలువాయికి వచ్చారు. కానీ మంగళవారం గుండెపోటుతో 71 ఏళ్ల అన్న కెంపురాజు కన్నుమూశారు. దీంతో గోవింద్‌రాజ్ బోరున విలపించారు.
మృతదేహంను అద్దె ఇంటిలో ఉంచేందుకు యజమాని అంగీకరించలేదు. చేతిలో డబ్బులు కూడా లేవు. దీంతో గోవింద్‌రాజ్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరికి కొత్తకావడంతో ఎవరిని సాయం అడగాలో కూడా తెలియలేదు. దీంతో చివరకు అన్న అంతిమయాత్రకు ఒంటరిగానే సిద్ధమయ్యాడు. దుప్పట్లు అమ్ముకునేందుకు తెచ్చుకున్న సైకిల్‌పై అన్న శవాన్ని ఉంచుకుని ఒంటరిగానే బయలుదేరాడు. ఈ దృశ్యాన్ని చూసిన వారు కదలిపోయారు. సాటిమనిషికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పంచాయతీ సిబ్బంది కూడా స్పందించారు. దీంతో కెంపురాజ్ అంత్యక్రియలు సజావుగా పూర్తయ్యాయి. తోడుగా వచ్చిన అన్న ఇప్పుడు లేకపోవడంతో తమ్ముడు గోవింద్‌రాజ్ ఒంటరిగా తిరుగుప్రయాణం అయ్యాడు.