రాజుగారిని ఒంటరి చేసి ఆడుకున్న టీడీపీ నేతలు
స్మార్ట్ సిటీ అంశంపై విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా మాటల దాడి చేయడం చర్చనీయాంశమైంది. సమీక్ష సమావేశంలో మాట్లాడిన విష్ణుకుమార్‌రాజు .. కేజీహెచ్ అంశాన్ని లేవనెత్తారు. విశాఖ స్మార్ట్ సిటీని చేయడం సంగతి దేవుడెరుగు ముందు ఆ కేజీహెచ్ సంగతి చూడండి అన్ని అన్నారు. కింగ్ జార్జ్ ఆస్పత్రికి డెంటల్ కాలేజ్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. […]
స్మార్ట్ సిటీ అంశంపై విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా మాటల దాడి చేయడం చర్చనీయాంశమైంది. సమీక్ష సమావేశంలో మాట్లాడిన విష్ణుకుమార్‌రాజు .. కేజీహెచ్ అంశాన్ని లేవనెత్తారు. విశాఖ స్మార్ట్ సిటీని చేయడం సంగతి దేవుడెరుగు ముందు ఆ కేజీహెచ్ సంగతి చూడండి అన్ని అన్నారు. కింగ్ జార్జ్ ఆస్పత్రికి డెంటల్ కాలేజ్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆస్పత్రిలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని మంత్రి సమక్షంలోనే నిలదీశారు. దీంతో టీడీపీ నేతలు మూకుమ్మడిగా విష్ణుకుమార్ రాజుపై మాటల దాడి చేశారు.
హెల్త్ మినిస్టర్ మీవాడే కదా వెళ్లి అడుగు అంటూ… టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. డెంటల్ కాలేజ్ అంశం ఇప్పుడెందుకు ముందు కూర్చో అని టీడీపీ నేత ఎంవీవీఎస్ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే గీతం విద్యాసంస్థల అధినేత కూడా అయినా ఎంవీవీఎస్ మూర్తికి డెంటల్ కాలేజ్ కూడా ఉంది. ఈ సమయంలో జోక్యం చేసుకున్న మంత్రి గంటా శ్రీనివాస్ కూడా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పట్ల కఠినంగానే మాట్లాడారు. డిసెంబర్ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలున్నాయి కదా అక్కడ మాట్లాడుకో ఇక్కడెందుకు అంటూ కామెంట్ చేశారు. ఇలా టీడీపీ నేతలంతా మూకుమ్మడిగా అటాక్ చేయడంతో చిన్నబుచ్చుకున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మౌనంగా ఉండిపోయారు.