కిషన్‌రెడ్డిపై సొంత ఎమ్మెల్యే తిరుగుబాటు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై సొంతపార్టీ ఎమ్మెల్యే తిరుగుబావుట ఎగరేశారు. కిషన్ రెడ్డిని వెంటనే అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాశారు. తెలంగాణలో పార్టీ ఎదగకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. కిషన్ రెడ్డి కేవలం తన అనుచరుల కోసమే పనిచేస్తున్నారని పార్టీని మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు జనంలోకి తీసుకెళ్లడంతో కిషన్ రెడ్డి విఫలమయ్యారని రాజాసింగ్ మండిపడ్డారు. ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని దెబ్బతీస్తున్నారని […]
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై సొంతపార్టీ ఎమ్మెల్యే తిరుగుబావుట ఎగరేశారు. కిషన్ రెడ్డిని వెంటనే అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాశారు. తెలంగాణలో పార్టీ ఎదగకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. కిషన్ రెడ్డి కేవలం తన అనుచరుల కోసమే పనిచేస్తున్నారని పార్టీని మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు జనంలోకి తీసుకెళ్లడంతో కిషన్ రెడ్డి విఫలమయ్యారని రాజాసింగ్ మండిపడ్డారు. ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కొంతకాలంగా కిషన్ రెడ్డి, రాజా సింగ్ మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు ఉన్నాయి.