Telugu Global
Others

సీపీఐ 90ఏళ్ల ప్రస్థానం

దేశంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత అత్యంత సీనియర్ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 25, 1925న ఆవిర్భవించింది. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత కూడా స్వేచ్ఛ, సమానత్వం కోసం పనిచేసిన పార్టీగా సీపీఐకి గుర్తింపు ఉంది. అలాంటి సీపీఐ ఇప్పుడు 90 ఏళ్ల పండుగకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 25 వరకు సంబరాలు నిర్వహించాలని ఆపార్టీ నిర్ణయించింది. ఈ90ఏళ్ల సీపీఐ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే..   1925లో ఏర్పాటైన సీపీఐ తదనంతర కాలంలో చీలిక […]

సీపీఐ 90ఏళ్ల ప్రస్థానం
X
దేశంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత అత్యంత సీనియర్ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 25, 1925న ఆవిర్భవించింది. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత కూడా స్వేచ్ఛ, సమానత్వం కోసం పనిచేసిన పార్టీగా సీపీఐకి గుర్తింపు ఉంది. అలాంటి సీపీఐ ఇప్పుడు 90 ఏళ్ల పండుగకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 25 వరకు సంబరాలు నిర్వహించాలని ఆపార్టీ నిర్ణయించింది. ఈ90ఏళ్ల సీపీఐ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే..
1925లో ఏర్పాటైన సీపీఐ తదనంతర కాలంలో చీలిక దిశగా పయనించింది. అయినా ఇప్పటికీ తన ఉనికి కాపాడుకుంటూ వచ్చింది. 1960వ దశకంలో సీపీఐ రెండు వర్గాలుగా విడిపోయింది. మార్క్సిజం పేరుతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ మార్స్కిజం (సీపీఎం) పార్టీని నెలకొల్పారు. ఆ తర్వాత కూడా సీపీఐ నుంచి సుమారు 15 కొత్త శాఖలు పుట్టుకొచ్చాయి. అయినా సీపీఐ మాత్రం ఇప్పటికీ దేశంలో ఉనికి చాటుతూనే ఉంది.
ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కమ్యూనిష్టుల పాత్ర గురించి చెప్పుకోవాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో వారి పాత్ర కీలకం. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు, సురవరం ప్రతాపరెడ్డి లాంటిటి ఎంతోమంది యోధాను యోధులు పార్టీని ముందుకు నడిపారు. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు తీసుకున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం సీపీఐకే చెల్లింది. రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపించి పేదలకు వేల ఎకరాల భూములు పంచిన చరిత్ర కూడా సీపీఐ పార్టీదే. ఒకనాడు దేశాన్ని ముందుండి నడిపిన సీపీఐ ఇప్పుడు ఆపార్టీకి ఉన్న జాతీయ గుర్తింపును కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీకి పునర్ వైభవం తెచ్చేందుకు సీపీఐ నాయకత్వం ప్రయత్నిస్తోంది. 90ఏళ్ల వార్షికోత్సవాల సందర్భంగా పార్టీ పటిష్టతకు ప్రణాళిక రూపొందించనున్నారు.
First Published:  1 Dec 2015 11:19 AM IST
Next Story