రామ్ గోపాల్ వర్మ ఆత్మకథలో శ్రీదేవికి ఒక ఛాప్టర్
శ్రీదేవిలేని రామ్ గోపాల్ వర్మ ఆత్మకథ ఉండదన్న సంగతి అందరికీ తెలిసిందే. దాన్ని నిజం చేస్తూ వర్మ తన ఆత్మకథ గన్స్ అండ్ థైస్‌లో శ్రీదేవికి ఒక ఛాప్టర్‌నే కేటాయించారు. ఎవరేమనుకున్నా నేననుకున్నది చెప్పేతీరుతాను అనే వర్మ, ఇప్పుడు కూడా శ్రీదేవి విషయంలో తాను కాస్త శ్రుతిమించి తన ఫీలింగ్స్‌ని వ్యక్తీకరించినట్టుగా ఒప్పుకుంటున్నారు. ఆ ఫీలింగ్స్‌ని ఆయన డ్రగ్స్‌తో పోల్చారు. శ్రీదేవిని సౌందర్యదేవతగా వర్ణించిన వర్మ, ఆమె ఒక సాధారణ మహిళలా ఇంట్లో టీ తయారుచేస్తున్న దృశ్యం […]
శ్రీదేవిలేని రామ్ గోపాల్ వర్మ ఆత్మకథ ఉండదన్న సంగతి అందరికీ తెలిసిందే. దాన్ని నిజం చేస్తూ వర్మ తన ఆత్మకథ గన్స్ అండ్ థైస్‌లో శ్రీదేవికి ఒక ఛాప్టర్‌నే కేటాయించారు. ఎవరేమనుకున్నా నేననుకున్నది చెప్పేతీరుతాను అనే వర్మ, ఇప్పుడు కూడా శ్రీదేవి విషయంలో తాను కాస్త శ్రుతిమించి తన ఫీలింగ్స్‌ని వ్యక్తీకరించినట్టుగా ఒప్పుకుంటున్నారు. ఆ ఫీలింగ్స్‌ని ఆయన డ్రగ్స్‌తో పోల్చారు.
శ్రీదేవిని సౌందర్యదేవతగా వర్ణించిన వర్మ, ఆమె ఒక సాధారణ మహిళలా ఇంట్లో టీ తయారుచేస్తున్న దృశ్యం తనని ఎంతగానో నిరాశానిస్పృహల్లో పడేసిందన్నారు. శ్రీదేవి అనే దేవతని స్వర్గం నుండి తన అపార్ట్‌మెంట్ కిచెన్లోకి దించేసిన బోనీకపూర్‌ని తాను జీవితంలో క్షమించలేనన్నారు. ఈ ఛాప్టర్లోని తన భావాలు ఒక ప్రేమలేఖ లాంటివని, ఎవరికైనా ఎవరిమీదైనా ఆకర్షణ అనేది ఏర్పడవచ్చని, ఆ పర్సన్ సాధారణ వ్యక్తా, సెలబ్రిటీనా అనేది ముఖ్యం కాదని, ఆ ఫీలింగ్‌ని శిఖరాగ్రస్థాయిలో అనుభూతి చెందడమే ముఖ్యమని వర్మ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక సాహితీ ఉత్సవంలో పాల్గొన్న వర్మ ఈ విషయాలు చెప్పుకొచ్చారు.
ఊర్మిళమంటోద్కర్ గురించి అడిగినపుడు ఆమెలోని అందాన్ని కెమెరాలో బంధించి ప్రపంచానికి చూపడం కూడా రంగీలా సినిమా తీయడం వెనుక ఉన్న ముఖ్యమైన కారణాల్లో ఒకటన్నారు. ఆ సినిమాతో ఊర్మిళ సూపర్‌హీరోయిన్ అయిపోయిన సంగతి తెలిసిందే. దర్శకుడికి తన పాత్రలతో ఉండాల్సిన అనుబంధం గురించి కూడా వర్మ ఈ సందర్భంగా చెప్పారు. ఆడా మగా అనే తేడా లేకుండా తాను తన సినిమాల్లోని పాత్రలకు ఒకేలా కనెక్ట్ అవుతానన్నారు. అలా తాను మమేకమైన మరొక పాత్ర సర్కార్‌లోని అమితాబ్ పాత్ర అని పేర్కొన్నారు. ఆయన మగవాడు అయినా సర్కార్‌పాత్ర, తనని రంగీలాతో సమానంగా ఊపేసిన పాత్రగా పేర్కొన్నారు. అమితాబ్ సునిశిత హావభావాలను కెమెరాలోకి ఎక్కించడం కోసం తాను ఎంతగానో తపించానన్నారు.
ఫౌంటైన్ హెడ్ పుస్తక రచయిత్రి అయాన్‌రాండ్‌కి తన ఆత్మకథని అంకితమిస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ఎప్పటికైనా ఆ పుస్తకాన్ని చిత్రంగా మలచాలనేది తన కల అన్నారు. ఆ రచన తాలూకూ చాలా విషయాలు తన మైండ్‌లో నిండిపోయి ఉన్నాయని వాటిని డీకోడ్ చేసి సినిమాగా మలచుకోవాల్సి ఉందని ఆయన అన్నారు.