మీడియా 'అతి'ని గుర్తు చేసిన గవర్నర్
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో మీడియాపై గవర్నర్ నరసింహన్ సుతిమెత్తని విమర్శలు చేశారు. మీడియా నుంచి ఎదురైన అనుభవాలను ప్రస్తావించారు. తాను భక్తితో గుడికి వెళ్లినా దానిపైనా వార్తలు రాస్తున్నారని తప్పుపట్టారు. గవర్నర్ అయినంత మాత్రాన దేవాలయాలకు వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు. గవర్నర్‌గా తన సేవలకు గుర్తింపు ఇవ్వకపోయినా పర్వాలేదని, కనీసం తన వయసుకైనా గౌరవం ఇవ్వండని నరసింహన్ కోరారు. ఒకప్పుడు తన సోదరుడు అసోంలో తీవ్రవాదుల చేతిలో చనిపోయిన సమయంలో భౌతికకాయాన్ని […]
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో మీడియాపై గవర్నర్ నరసింహన్ సుతిమెత్తని విమర్శలు చేశారు. మీడియా నుంచి ఎదురైన అనుభవాలను ప్రస్తావించారు. తాను భక్తితో గుడికి వెళ్లినా దానిపైనా వార్తలు రాస్తున్నారని తప్పుపట్టారు. గవర్నర్ అయినంత మాత్రాన దేవాలయాలకు వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు. గవర్నర్‌గా తన సేవలకు గుర్తింపు ఇవ్వకపోయినా పర్వాలేదని, కనీసం తన వయసుకైనా గౌరవం ఇవ్వండని నరసింహన్ కోరారు.
ఒకప్పుడు తన సోదరుడు అసోంలో తీవ్రవాదుల చేతిలో చనిపోయిన సమయంలో భౌతికకాయాన్ని తీసుకొస్తుంటే.. ఒక మీడియా ప్రతినిధి వచ్చి ”కైసా లగ్తా హై” అని ప్రశ్నించారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి పోకడ సమాజానికి మంచిది కాదని సూచించారు.
రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించకుండా గవర్నర్ గుళ్ల చుట్టూ తిరుగుతున్నారంటూ ఆ మధ్య కొన్ని మీడియా సంస్థలు పదేపదే కథనాలు ప్రసారం చేశాయి. బహుశా దాన్ని దృష్టిలో ఉంచుకునే ”గవర్నర్ దేవాలయాలకు వెళ్లడం తప్పా?” అని నరసింహన్ ప్రశ్నించారని భావిస్తున్నారు.