బాహుబలి-2 ఓవర్సీస్ రేటు ఎంతో తెలుసా
నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపించిన బాహుబలి సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు ఇప్పుడు రెండో భాగం తెరకెక్కుతోంది. అయితే, సినిమా షూటింగ్‌లో ఉండగానే ఈ చిత్రం ఓవర్సీస్ బిజినెస్ పదుల కోట్ల రూపాయలు పలుకుతుండటం విశేషం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నిర్మాతలు ఓవర్సీస్‌లో తెలుగు, హిందీ, ఇతర భాషలట్లో కలిపి ఏకంగా రూ.75 కోట్లకు అమ్మాలని […]
BY sarvi30 Nov 2015 12:32 AM IST
X
sarvi Updated On: 30 Nov 2015 8:56 AM IST
నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపించిన బాహుబలి సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు ఇప్పుడు రెండో భాగం తెరకెక్కుతోంది. అయితే, సినిమా షూటింగ్‌లో ఉండగానే ఈ చిత్రం ఓవర్సీస్ బిజినెస్ పదుల కోట్ల రూపాయలు పలుకుతుండటం విశేషం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నిర్మాతలు ఓవర్సీస్‌లో తెలుగు, హిందీ, ఇతర భాషలట్లో కలిపి ఏకంగా రూ.75 కోట్లకు అమ్మాలని నిర్ణయించారట. బాహుబలి-2 మొదటి భాగాన్ని మించిన విజయాన్ని సాధిస్తుందన్న నిర్మాతల ధీమానే ఇందుకు కారణం.
అంత ఇవ్వలేమన్న డిస్ట్రిబ్యూటర్లు!
ఓవర్సీస్ రేటు విన్న డిస్ట్రిబ్యూటర్లు గుడ్లు తేలేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్. రూ.75 కోట్లంటే మరీ ఎక్కువని వాపోయారట. కనీసం రూ.45 కోట్లకు వస్తే ఈ చిత్రాన్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అంత తక్కువ రేటుకు ఎలా ఇచ్చేస్తామంటున్నారు. దీంతో మధ్యే మార్గంగా రూ.50 కోట్లయినా దాటితే హక్కులు ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే అన్నట్లు తెలిసింది. దీంతో దాదాపుగా బేరం తెగేలానే ఉంది. ఏదైనా సినిమా పూర్తి కాకముందే చేసుకోవాలి. నిర్మాణం పూర్తయితే అప్పటికి రేటు మరీ పెరిగితే ఎలా? అన్న ఆందోళన డిస్ట్రిబ్యూటర్లను వెంటాడుతోంది. త్వరలోనే ఈ సినిమాను రూ.50 కోట్లకు పైగా వెచ్చింది కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు.
Next Story