టీ తాగే వారికి... బియ్యం అవసరమా?
దేనైనా సరే మోహమాటం లేకుండా బయటకు తెచ్చే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు బియ్యం మీద పడ్డారు. ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఉచిత విద్యుత్‌పైనా హాట్ కామెంట్స్ చేశారు. అనంతపురంలో మీడియా ప్రతినిధులతో మాట్టాడిన జేసీ … దారిద్రరేఖ దిగువనున్న వారి కోసం ఉద్దేశించిన బియ్యం పథకం ఇప్పుడు అందరికీ వర్తింప చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ సొంతంగా కప్పు టీకి రూ. 5 చెల్లించి రోజుకు నాలుగైదు సార్లు […]

దేనైనా సరే మోహమాటం లేకుండా బయటకు తెచ్చే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు బియ్యం మీద పడ్డారు. ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఉచిత విద్యుత్‌పైనా హాట్ కామెంట్స్ చేశారు. అనంతపురంలో మీడియా ప్రతినిధులతో మాట్టాడిన జేసీ … దారిద్రరేఖ దిగువనున్న వారి కోసం ఉద్దేశించిన బియ్యం పథకం ఇప్పుడు అందరికీ వర్తింప చేస్తున్నారని చెప్పారు.
ప్రతి ఒక్కరూ సొంతంగా కప్పు టీకి రూ. 5 చెల్లించి రోజుకు నాలుగైదు సార్లు తాగుతున్నారని అన్నారు. జనం ఆర్థికంగా ఆ స్థాయికి వచ్చాక కూడా కిలో బియ్యం రూపాయికే ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాయితీలు తగ్గించి ఆ సొమ్మును సరైన మార్గంలో ఖర్చుపెట్టాలని సూచించారు. ఉచిత విద్యుత్ కూడా పరిమిత స్థాయిలో ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తేనే మంచి జరుగుతుందని సూచించారు.