ఇకపై సింగిల్‌గా వద్దు... గుంపుగా పోదాం!
వరంగల్ ఉప ఎన్నికలో తమ కూటమి అభ్యర్థి డిపాజిట్లు కూడా కోల్పోవడంతో టీడీపీ నేతలు బెదిరిపోయారు. భవిష్యత్తుపై బెంగపెట్టుకున్న తెలంగాణ తెలుగు తమ్ముళ్లు శనివారం హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ భేటీకి టీటీడీపీ ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఈసందర్భంగా చంద్రబాబు, టీటీడీపీ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. వరంగల్ ఎన్నిక దెబ్బ తర్వాత ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చంద్రబాబు సలహాలు కోరారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు నేతలంతా గుంపు పోరాటం వైపు […]
వరంగల్ ఉప ఎన్నికలో తమ కూటమి అభ్యర్థి డిపాజిట్లు కూడా కోల్పోవడంతో టీడీపీ నేతలు బెదిరిపోయారు. భవిష్యత్తుపై బెంగపెట్టుకున్న తెలంగాణ తెలుగు తమ్ముళ్లు శనివారం హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ భేటీకి టీటీడీపీ ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఈసందర్భంగా చంద్రబాబు, టీటీడీపీ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. వరంగల్ ఎన్నిక దెబ్బ తర్వాత ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చంద్రబాబు సలహాలు కోరారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు నేతలంతా గుంపు పోరాటం వైపు మొగ్గు చూపినట్టు సమాచారం.
టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే ఇకపై ఒంటిగా కాకుండా అధికార పార్టీని వ్యతిరేకించే అన్ని పార్టీలను కలుపుకుని గుంపుగా పోరాటం చేస్తే బాగుంటుందని నేతలంతా అభిప్రాయపడ్డారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే ఫార్ములాను ప్రయోగించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. కలిసి పనిచేసేలా ఇతర పార్టీలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని నిర్ణయించారు.
పనిలోపనిగా వరంగల్ ఉప ఎన్నిక ఓటమిపై చిన్నపాటి పోస్టుమార్టం నిర్వహించారు. వరంగల్ స్థానాన్ని బీజేపీకి కేటాయించడం వల్లే అనుకున్న ఫలితం రాలేదని తమ్ముళ్లు తమకుతాము సర్ధిచెప్పుకున్నారు. బీజేపీ బరిలో దిగడం వల్లే టీఆర్‌ఎస్‌కు పరిస్థితి అనుకూలించిందని ఎర్రబెల్లి దయాకర్‌రావు సమావేశంలో అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ నిధులు కుమ్మురిస్తే… బీజేపీ నిధులు ఇవ్వలేకపోయిందని దయాకర్‌రావు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మొత్తం మీద చంద్రబాబుతో సమావేశం అనంతరం ఇకపై తెలంగాణలో ఒంటరిగా కాకుండా గుంపుగా ఎన్నికలకు వెళ్లాలని టీటీడీపీ నేతలు ఒక నిర్ధారణకు వచ్చినట్టు చెబుతున్నారు.