Telugu Global
Cinema & Entertainment

వ‌ర్మ ను  యుజ్ లెస్ ఫెలోస్ లిస్ట్ లో చేర్చిన  పూరీ జ‌గ‌న్నాధ్..!

రామ్ గోపాల్ వర్మకు పూరి శిష్యుడిలా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి పూరి… వర్మను యూజ్ లెస్ అంటే ఎలా ఉంటుంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే వర్మను పూరి వ్యక్తిగతంగా అలా ఏమీ విమర్శించలేదు కానీ… పరోక్షంగా యూజ్ లెస్ పీపుల్ లిస్టులో వర్మను చేర్చాడు. దేశంలో అసహనం పెరిగిపోతోంది..నా భార్య ఈ దేశం విడిచివెళ్లి పోదాం అంటోంది అంటూ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. ఈ వివాదంలో […]

వ‌ర్మ ను  యుజ్ లెస్ ఫెలోస్ లిస్ట్ లో చేర్చిన  పూరీ జ‌గ‌న్నాధ్..!
X

రామ్ గోపాల్ వర్మకు పూరి శిష్యుడిలా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి పూరి… వర్మను యూజ్ లెస్ అంటే ఎలా ఉంటుంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే వర్మను పూరి వ్యక్తిగతంగా అలా ఏమీ విమర్శించలేదు కానీ… పరోక్షంగా యూజ్ లెస్ పీపుల్ లిస్టులో వర్మను చేర్చాడు. దేశంలో అసహనం పెరిగిపోతోంది..నా భార్య ఈ దేశం విడిచివెళ్లి పోదాం అంటోంది అంటూ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. ఈ వివాదంలో కొందరు సినీ సెలబ్రిటీలు అమీర్ ఖాన్‌ను విమర్శిస్తే… మరికొందరు సపోర్ట్ చేసారు. ఈ విషయమై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ…హిందూ దేశం ‘ఇండియా’లో ముస్లిం వర్గానికి చెందిన అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ టాప్ స్టార్లుగా ఎదిగారు.

మరి దేశంలో మత అసహనం ఎక్కడ ఉందో నాకైతే అర్థం కావడం లేదు. ఒక హిందూ దేశంలో ముగ్గురు ముస్లింలు స్టార్లుగా వెలుగుగొందుతున్నారంటే మెజారిటీ ప్రజలు అసహనంతో లేరని రుజువుచేస్తోంది. అలాంటి పరిస్థితులే ఉంటే ఈ ముగ్గురు ఇంత పెద్ద స్టార్లు గా ఎదిగేవారే కాదు అని వర్మ అభిప్రాయ పడ్డారు. అయితే పూరి మాత్రం అమీర్ ఖాన్ ను సపోర్ట్ చేసారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యల్లోని పరమార్థాన్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ దీన్ని ఓ వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. యూజ్ లెస్ పీపుల్ ఆయనపై గొంతు చించుకుంటున్నారు. ఒకవేళ ఆయన ఆల్ ఖైదా లేదా ఐసిస్ లాంటి వాటిల్లో ఉంటే ఏ భారతీయుడైనా ఇలాంటి నాన్సెన్స్ సృష్టించే ధైర్యం చేసే వాడా? అంటూ పూరి ట్వీట్ చేసారు. అమీర్ ఖాన్ వివాదం విషయంలో తన గురువు వర్మను యూజ్ లెస్ లిస్టులో చేర్చేసాడు పూరి.

First Published:  29 Nov 2015 2:56 AM IST
Next Story