Telugu Global
Others

ఆనం బ్రదర్స్ చంద్రబాబును ఏమని తిట్టారంటే!

అధికారం అనే ఆక్సిజన్ కోసం నేతలు ఏమైనా మాట్లాడుతారని ఆనం బ్రదర్స్ కూడా నిరూపించారు. మొన్నటి వరకు చంద్రబాబును తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన ఆనం సోదరులు ఇప్పుడు ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. టీడీపీలో చేరుతున్న సందర్భంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో అన్నదమ్ముల ప్రసంగాలు విన్న వారు…కొద్ది రోజుల క్రితం వారు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరిన బొత్స సత్యనారాయణకు ఆనం చెప్పిన నీతులు గుర్తు చేసుకుంటున్నారు. కార్యకర్తల సమావేశంలో […]

ఆనం బ్రదర్స్ చంద్రబాబును ఏమని తిట్టారంటే!
X

అధికారం అనే ఆక్సిజన్ కోసం నేతలు ఏమైనా మాట్లాడుతారని ఆనం బ్రదర్స్ కూడా నిరూపించారు. మొన్నటి వరకు చంద్రబాబును తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన ఆనం సోదరులు ఇప్పుడు ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. టీడీపీలో చేరుతున్న సందర్భంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో అన్నదమ్ముల ప్రసంగాలు విన్న వారు…కొద్ది రోజుల క్రితం వారు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరిన బొత్స సత్యనారాయణకు ఆనం చెప్పిన నీతులు గుర్తు చేసుకుంటున్నారు.

కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆనం వివేకానందరెడ్డి…. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రం కోసం ఒంటరి పోరాటం చేస్తున్న చంద్రబాబుకు అండగా ఉండాలనే తాము టీడీపీలో చేరుతున్నామని చెప్పారు. ఇదే వివేకానందరెడ్డి కొద్ది రోజుల క్రితం వరకు చంద్రబాబును ఏమేమీ తిట్టారంటే…

Click to Read: గుడ్లు అమ్ముకునే మీకెందుకే జీతాలు- మహిళలపై చింతమనేని బూతులు

ఫిబ్రవరి 24, 2015

రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌ పేరుతో ఇంటర్నేషనల్‌ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చంద్రబాబు తెరలేపారు.

ఏప్రిల్‌ 23, 2015- వివేకానందరెడ్డి( అంగన్ వాడి మహిళల ఆందోళనకు మద్దతు తెలుపుతూ)

చంద్రబాబు లేడి రేపిస్ట్‌గా తయారయ్యారు. అంగన్‌ వాడీ మహిళలు…. ఆయనకు ఆడవారిగా కనిపించడం లేదా?. మంత్రి నారాయణ ఓ చీకటి మంత్రి.

మే 10 , 2015 – ఆనం వివేకా

నారా లోకేష్ కనుసన్నల్లో రాష్ట్ర పాలన సాగుతోంది.

మే 14, 2015- ఆనం వివేకా

చంద్రబాబు రాగానే ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. పదేళ్ల అరణ్యవాసం తర్వాత బుద్ది వచ్చి ఉంటుందని చంద్రబాబును గెలిపిస్తే రైతులను మోసం చేశావు. మహిళలను మోసం చేశావు. ఉద్యోగుల ఉసురు పోసుకున్నావ్‌. ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నావ్. రుణమాఫీ పేరుతో ఇప్పటి వరకు ఏ సీఎం చేయని రీతిలో మోసం చేశారు.

మే 31. 2015 – ఆనం వివేకా ( బొత్స కాంగ్రెస్‌ను వీడిన సందర్భంగా)

బొత్స వెళ్లడం దారుణం. కాంగ్రెస్‌కు ద్రోహం చేశారు. పార్టీకి వెన్నుపోటు పొడిచారు. ఇప్పటికే చాలా మంది పోటు పొడిచి వెళ్లారు వారిలో ఈయన(బొత్స) ఒకరు.అయినా బొత్స ఉంటేనే గెలిచామా… ఆయన లేకుంటే ఓడిపోయామా?

జూన్ 5, 2015- ఆనం వివేకా

చంద్రబాబు వాడుకుని వదిలేసే టైప్. గతంలో బాబూమోహన్, జయపద్రను వాడుకుని వదిలేశారు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ను వాడుకుంటున్నారు. ఆయన్ను కూడా వదిలేస్తారు. పవన్ జాగ్రత్త పడాలి.

జూన్ 15, ఆనం రామనారాయణరెడ్డి( ఏపీ కాంగ్రెస్ దీక్ష సందర్భంగా)

ఓటుకు నోటు కేసులోచంద్రబాబు ఎందుకు రాజీనామా చేయడం లేదు?. రేవంత్ కేవలం దళారి మాత్రమే. చంద్రబాబు ఆదేశాలను పాటించాడంతే. రేవంత్‌ను మాత్రమే ముద్దాయిని చేసి చంద్రబాబు తప్పించుకుంటున్నారు. చంద్రబాబు తీరును వ్యవస్థలు చూస్తూ ఊరుకోకూడదు.

Click to Read: 15-year-old gang-raped, aunt received video on WhatsApp

First Published:  29 Nov 2015 2:39 AM IST
Next Story