Telugu Global
Others

సొంత జిల్లా నీటిపైనే నీళ్లు చల్లిన చంద్రబాబు?

ఇప్పటికే రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆ ప్రాంత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ మరో వివాదం తెరపైకి వచ్చింది. చిత్తూరు జిల్లా తాగునీటి కష్టాలను తీర్చేందుకు గత ప్రభుత్వ హయాంలో వాటర్‌ స్కీంను ప్రకటించగా ఇప్పుడు దాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడం చర్చనీయాంశమైంది.  గత ప్రభుత్వం చిత్తూరు జిల్లా వాటర్‌ స్కీంకు రూ. 7వేల 390 కోట్లు కేటాయించింది. అయితే ఈ పథకాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని మాజీ మంత్రి శైలజానాథ్‌ కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది రాయలసీమకు చంద్రబాబు […]

సొంత జిల్లా నీటిపైనే నీళ్లు చల్లిన చంద్రబాబు?
X

ఇప్పటికే రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆ ప్రాంత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ మరో వివాదం తెరపైకి వచ్చింది. చిత్తూరు జిల్లా తాగునీటి కష్టాలను తీర్చేందుకు గత ప్రభుత్వ హయాంలో వాటర్‌ స్కీంను ప్రకటించగా ఇప్పుడు దాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం చిత్తూరు జిల్లా వాటర్‌ స్కీంకు రూ. 7వేల 390 కోట్లు కేటాయించింది. అయితే ఈ పథకాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని మాజీ మంత్రి శైలజానాథ్‌ కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది రాయలసీమకు చంద్రబాబు చేస్తున్న మరో అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాజధాని … సీమకు దక్కకుండా చేసిన చంద్రబాబు ఇప్పుడు సొంత జిల్లాకే తాగు నీరు కూడా దక్కకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత ఈ స్కీమ్ ను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై ప్రభుత్వం వివరణ ఇస్తే ప్రజల్లో గందరగోళానికి తావుండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

First Published:  28 Nov 2015 9:24 AM IST
Next Story