Telugu Global
International

టెస్టుల్లోకి ఎంటరైన గులాబీ బంతి. ఎందుకు?

క్రికెట్‌ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. 138 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఆడిలైడ్‌లో ప్రారంభమైంది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. తొలిసారిగా గులాబీ రంగు బంతిని ప్రవేశపెట్టారు. అయితే గులాబీ రంగు బంతిపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్టు సభ్యులు తొలుత అభ్యంతరం తెలిపారు. బంతి పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఫీల్డింగ్ చేసే సమయంలో పింక్ బంతి సరిగ్గా కనిపించదనేది […]

టెస్టుల్లోకి ఎంటరైన గులాబీ బంతి. ఎందుకు?
X

క్రికెట్‌ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. 138 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఆడిలైడ్‌లో ప్రారంభమైంది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. తొలిసారిగా గులాబీ రంగు బంతిని ప్రవేశపెట్టారు. అయితే గులాబీ రంగు బంతిపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్టు సభ్యులు తొలుత అభ్యంతరం తెలిపారు. బంతి పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు.

ఫీల్డింగ్ చేసే సమయంలో పింక్ బంతి సరిగ్గా కనిపించదనేది క్రికెటర్ల ప్రధాన వాదన. ఫీల్డర్‌కు కనిపించనప్పుడు చూసే అభిమానులు బంతిని ఎలా గుర్తిస్తారని క్రికెటర్లు ప్రశ్నిస్తూ వచ్చారు. బౌలింగ్ చేసే సమయంలో గులాబి రంగు బంతి స్వింగ్ అంత సులువగా అవదని వాదించారు. పైగా గులాబి బంతి త్వరగా మెరుపు కోల్పోతుందని… పేసర్లకు ఇబ్బందిగా మారుతుందని అనుమానం వ్యక్తం చేశారు. నిజానికి టెస్టుల్లో ఎరుపు రంగు బంతిని వాడతారు. డే/నైట్ మ్యాచ్‌లో రాత్రి సమయంలో ఫడ్‌లైట్ల వెలుతురులో ఆడాల్సి ఉంటుంది. అందుకే ఎరుపు కంటే ఇంకా స్పష్టంగా కనిపించేందుకు పింక్ రంగు బంతిని వాడాలని ఐసీసీ నిర్ణయించింది. పింక్ బంతులు ప్రముఖ సంస్థ కుకుబుర్రా తయారుచేస్తోంది. క్రికెటర్ల అనుమానాల్లో వాస్తవికత లేదని బంతుల తయారీ సంస్థ చెబుతోంది. గత నాలుగేళ్ల నుంచే పింక్ బంతిపై ప్రయోగాలు జరిగాయి. చివరకు ఆడిలైడ్ టెస్ట్ ద్వారా పింక్ బంతి క్రికెట్ రంగ ప్రవేశం చేసింది.

First Published:  28 Nov 2015 12:00 PM IST
Next Story