Telugu Global
Cinema & Entertainment

సైజ్‌ జీరో రివ్యూ

రేటింగ్‌: 2.75 విడుదల తేదీ : 20 నవంబర్ 2015 దర్శకత్వం :  కేఎస్‌ ప్రకాశ్‌ ప్రొడ్యూసర్‌:  ప్రసాద్‌ వి పొట్లూరి సంగీతం : యమ్‌.యమ్‌. కీరవాణి నటీనటులు : ఆర్య, అనుష్కా శేట్టి  మన దేశంలో ముఖ్యంగా అందానికి సంబంధించి మూడురకాల వ్యాపారాలున్నాయి. జుత్తుమొలిపించడం, నల్లగావున్న మొహాన్ని ఎర్రగా చేయడం, లావు తగ్గించడం. వీటిలో చాలా మోసాలున్నాయని ఎందరు మొత్తుకున్నా కోట్లరూపాయల వ్యాపరం జరుగుతూనేవుంది. లావు సమస్యపై తీసిన సినిమా సైజ్‌ జీరో అని పోస్టర్‌ […]

సైజ్‌ జీరో రివ్యూ
X

రేటింగ్‌: 2.75
విడుదల తేదీ : 20 నవంబర్ 2015
దర్శకత్వం : కేఎస్‌ ప్రకాశ్‌
ప్రొడ్యూసర్‌: ప్రసాద్‌ వి పొట్లూరి
సంగీతం : యమ్‌.యమ్‌. కీరవాణి
నటీనటులు : ఆర్య, అనుష్కా శేట్టి

మన దేశంలో ముఖ్యంగా అందానికి సంబంధించి మూడురకాల వ్యాపారాలున్నాయి. జుత్తుమొలిపించడం, నల్లగావున్న మొహాన్ని ఎర్రగా చేయడం, లావు తగ్గించడం. వీటిలో చాలా మోసాలున్నాయని ఎందరు మొత్తుకున్నా కోట్లరూపాయల వ్యాపరం జరుగుతూనేవుంది.

లావు సమస్యపై తీసిన సినిమా సైజ్‌ జీరో అని పోస్టర్‌ చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కథ ఏమిటంటే స్వీటి (అనుష్క) బరువు 93 కిలోలు. స్వీటి బరువువల్ల పెళ్ళిసంబంధాలు కుదరడం లేదని తల్లి ఊర్వశికి బెంగ. తన బరువుపైన అయిష్టత ఉన్నప్పటికీ తిండితగ్గించడం, వ్యాయామాలు చేయడం స్వీటీకి కుదరనిపని. ఈ పరిస్థితుల్లో పెళ్ళిచూపులకి ఆర్య వస్తాడు. అందరూ తనని నచ్చడం లేదంటున్నారనే కోపంతో తనకి నచ్చలేదని ఆర్యకి చెబుతుంది. ఆ తరువాత ఆర్యపై మెల్లిగా ఇష్టం ఏర్పడుతుంది. అయితే ఆర్య ఇంకొకరితో ప్రేమలో వుంటాడు. దాంతో బరువుతగ్గాలని సైజ్‌ జీరో క్లినిక్‌లో చేరుతుంది. అక్కడి మోసాలను పసిగట్టి వ్యతిరేక ప్రచారం చేపడుతుంది. మధ్యలో ముక్కోణపు ప్రేమ. చివరికి సుఖాంతం.

ఈ సినిమా ప్రారంభంలోనే మనకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనవాళ్ళు కూడా కథల్ని కొత్తగా ఆలోచిస్తున్నారని ఆనందమేస్తుంది. హిందీలో వాళ్ళకున్న మార్కెట్‌ దృష్ట్యా ఇలాంటి మెట్రో కథలని చాలా తీసారు. అయితే మన వాళ్ళకున్న ఫార్ములా వల్ల ఇక్కడ కొత్తగా ఆలోచించాలంటే భయపడతారు. ఈ కథను తయారు చేసింది దర్శకుడి భార్య కనిక. ఆమె చాలా హిందీ సినిమాలకు పనిచేయడం వల్ల కొంచెం భిన్నంగా కథ తయారైంది. ఫస్టాఫ్‌ వరకు అద్భుతంగా సాగిన సినిమా సెకండాఫ్‌లో చాలా సినిమాల్లాగే చతికిలపడింది. దీనికి కారణం ఒక స్పష్టమైన పాయింట్‌ లేకపోవడం, హాస్యం లోపించడం. ఓబెసిటిపైనే సినిమా తీయాలనుకుంటే కథ మొత్తం దానిపైనే నడపొచ్చు. మధ్యలో ట్రయాంగిల్‌ లవ్‌, స్వచ్ఛభారత్‌ని నెత్తినేసుకుని మరుగుదొడ్ల క్లీనింగ్‌ ఇవన్నీ అనవసరం. పైగా ప్రకాశ్‌రాజ్‌ లాంటి ఆద్భుతమైన నటుడు ఒబెసిటి క్లినిక్‌ ఓనర్‌గా ఉన్నప్పుడు ఎంత కామెడీకైనా స్కోపుంది. అతన్ని సీరియస్‌ విలన్‌ చేయడమే మైనస్.

Click to Read: త‌ను -నేను సినిమా రివ్యూ

లావు తగ్గాలటే క్లినిక్‌లో చేరకూడదు. ఎక్సర్‌సైజ్ చేయడమే మార్గమనే సందేశాన్ని సరైన రీతిలో ఈ సినిమా ఇవ్వలేకపోయింది. అయినా కూడా చాలా సన్నివేశాల్లో మనం లీలమైపోడానికి కారణం అనుష్క. ఈ ప్రాత్ర కోసమే బరువు పెరిగిందంటే ఆమె నటన కోసం ఎంత కష్టపడుతుందో అర్థమవుతుంది. ఎందురు యాక్టర్లున్న ఇది అనుష్క షో. హీరోయిన్లకు ప్రాధాన్యత తగ్గిపోతున్నఈ రో్జుల్లో మళ్లీ సావిత్రి, వాణిశ్రీ లాంటి వారిని గుర్తు చేసింది. కామెడి, సీరియస్‌నెస్ అన్ని పండించింది. కె. ఎస్ ప్రకాశ్‌రావు మనవడు, రాఘవేంద్రరావు కుమారుడు కేఎస్‌ ప్రకాశ్‌ దీనికి దర్శకుడు. కథలో లోపాలు, నత్తనడక ఉన్నప్పుటికీ కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తి. ఒక మంచి సినిమా తీయాలనే ప్రయత్నం చేశారు కానీ తీయలేకపోయారు. కథ మీద ఇంకా గట్టిగా వర్క్‌ చేయకపోవడమే కారణం.

ఊర్వశి, గొల్లపూడి, బ్రహ్మానందం, అడవి శేషు వీళ్లంతా తమ పరిధి మేరకు బాగా నటించారు. డైలాగుల్లో ప్రాసలు, పంచ్‌లు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పటికీ హాస్వానికి చాలా స్కోప్‌ ఉన్న సినిమాని సరిగా వాడుకోలేకపోయారు.

ఏది ఏమైనా ఇది అనుష్క కోసం చూడాల్సిన సినిమా

– జీఆర్‌ మహర్షి

First Published:  27 Nov 2015 3:45 AM
Next Story