Telugu Global
Others

నిర్ధారణ- ఓటుకు నోటు వాయిస్‌ ఆయనదే

ఓటుకు నోటు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆడియో, వీడియో టేపులను పరిశీలించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ తుది నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ఆడియో, వీడియో టేపుల్లో ఉన్న వాయిస్ నిందితులదేనని తేల్చింది. టీటీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ నేత మత్తయ్య వాయిస్‌తో ఆడియో, వీడియో టేపుల్లోని వాయిస్‌ సరిపోలినట్టు నిర్ధారించింది. Click to Read: పాతిక కోట్లు పోసి కొనుకున్నార‌ట‌..! నిందితులు రేవంత్‌ రెడ్డి, సండ్ర వాయిస్ నమూనాలను అసెంబ్లీలో, […]

నిర్ధారణ- ఓటుకు నోటు వాయిస్‌ ఆయనదే
X

ఓటుకు నోటు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆడియో, వీడియో టేపులను పరిశీలించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ తుది నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ఆడియో, వీడియో టేపుల్లో ఉన్న వాయిస్ నిందితులదేనని తేల్చింది. టీటీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ నేత మత్తయ్య వాయిస్‌తో ఆడియో, వీడియో టేపుల్లోని వాయిస్‌ సరిపోలినట్టు నిర్ధారించింది.

Click to Read: పాతిక కోట్లు పోసి కొనుకున్నార‌ట‌..!

నిందితులు రేవంత్‌ రెడ్డి, సండ్ర వాయిస్ నమూనాలను అసెంబ్లీలో, మీడియా పాయింట్ల వద్ద వారు మాట్లాడిన వీడియోల నుంచి సేకరించారు. వాటితో ఓటుకు నోటు స్టింగ్ ఆపరేషన్ సమయంలో రికార్డు చేసిన వాయిస్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌ సిబ్బంది సరిచూశారు. స్టింగ్ ఆపరేషన్ టేపుల్లో ఉన్నది రేవంత్, సండ్ర, మత్తయ్య వాయిసేనని నిర్ధారించారు. వీరి వాయిస్‌ను నిర్ధారించిన నేపథ్యంలో చంద్రబాబుపై అందరి దృష్టి ఉంది. ఆడియో టేపుల్లో చంద్రబాబు సంభాషణలు కూడా ఉండడంతో ఆయన వాయిస్‌ శాంపిల్స్‌ను కూడా పరీక్షించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే చంద్రబాబు నుంచి నేరుగా శాంపిల్స్ తీసుకుంటారా లేక ఇది వరకు అసెంబ్లీ, మీడియాతో మాట్లాడిన రికార్డుల నుంచి తీసుకుంటా అన్న దానిపై స్పష్టత లేదు. ఎఫ్ఎస్ఎల్ నివేదికను తమకు ఇవ్వాలని కోర్టును ఏసీబీ కోరనుంది.

Click to Read: నాకెందుకయ్యా… జనవరిలో రిటైర్ అవుతున్నా…!

First Published:  27 Nov 2015 5:55 AM IST
Next Story