పైపు నీళ్లు...ఉప్పు...కలిస్తే ముప్పేనట..!
పైపు నీళ్లు, ఉప్పు…మన దృష్టిలో చాలా సురక్షితమైనవి. ఇవి రెండూ లేకుండా అసలు వంట అనేది ఉంటుందా? కానీ వీటి వినియోగంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే మీకు నష్టమే అంటున్నారు పరిశోధకులు. నీటిని సురక్షితం చేసేందుకు వినియోగించే ప్రక్రియ క్లోరామినేషన్ (నీటికి క్లోరిన్, కొద్దిపాటి అమ్మోనియా కలపడం), అయోడైజ్ ఉప్పు ఇవి రెండు మన ఆరోగ్యంపై దుష్ఫలితాలు చూపుతాయని వీరు చెబుతున్నారు. మనం తాగుతున్న నీటిని శుభ్రపరచడం కోసం క్లోరిన్‌ని గాని, అమ్మోనియాతో తయారయిన క్లోరమైన్ అనే […]
పైపు నీళ్లు, ఉప్పు…మన దృష్టిలో చాలా సురక్షితమైనవి. ఇవి రెండూ లేకుండా అసలు వంట అనేది ఉంటుందా? కానీ వీటి వినియోగంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే మీకు నష్టమే అంటున్నారు పరిశోధకులు. నీటిని సురక్షితం చేసేందుకు వినియోగించే ప్రక్రియ క్లోరామినేషన్ (నీటికి క్లోరిన్, కొద్దిపాటి అమ్మోనియా కలపడం), అయోడైజ్ ఉప్పు ఇవి రెండు మన ఆరోగ్యంపై దుష్ఫలితాలు చూపుతాయని వీరు చెబుతున్నారు. మనం తాగుతున్న నీటిని శుభ్రపరచడం కోసం క్లోరిన్‌ని గాని, అమ్మోనియాతో తయారయిన క్లోరమైన్ అనే రసాయనాలను కానీ కలుపుతారు. ఇందులో ఏ విధానాన్ని పాటించినా నీరు రసాయన మిళితం అవుతుంది. ఈ రెండు విధానాలతో శుభ్రం చేసిన నీటిని, అయోడైజ్డ్ ఉప్పుని కలిపి వంట చేస్తే హైపోఅయోడస్ యాసిడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతున్నదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
ఈ హైపోఅయోడస్ యాసిడ్ ఆహారంతోనూ, నీటిలోని ఇతర అంశాలతోనూ కలిసినపుడు ఐ-డిబిపి (అయోడినేటెడ్ డిస్ఇన్‌ఫెక్షన్ బై ప్రొడక్షన్స్) అనే ఉప రసాయనాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి గురించి వాతావరణ కెమిస్టులకు కాని, విషతత్వ రసాయనాల నిపుణులకు కానీ, ఇంజినీర్లకు గానీ అంతుపట్టడం లేదని హాంగ్‌కాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జియాంగ్రు జాంగ్ అంటున్నారు.
ఈ ఐ-డిబిపిలు క్లోరినేటెడ్ (క్లోరిన్ కలిపిన నీరు), క్లోరామినేటెడ్ (అమ్మోనియా కలిపిన నీరు) నీళ్లతో వంట చేస్తున్నపుడు ఏర్పడుతున్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. కొన్ని రసాయన పద్ధతుల ద్వారా పరిశోధనలు చేసినపుడు 14 రకాల సరికొత్త ఐ-డిబిపి మాలిక్యుల్స్ ఏర్పడుతున్నాయని, ఇందులో కొన్ని ఇతరవాటి కంటే 50 నుండి 200 రెట్లు విషపూరితంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.
ఇవి మన ఆరోగ్యానికి హానిచేస్తాయని తెలుస్తోందని, అయితే ఎలాంటి హాని జరుగుతుందనే విషయాన్ని ఇంకా పరిశోధించాల్సి ఉందని చైనాలోని నాన్‌జింగ్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ యాంగ్‌పాన్ అంటున్నారు. ఎలాంటి నీరు, ఉప్పు వాడారు, ఎంత వేడిలో ఎంత సమయం ఉడికించారు అనేదాన్ని బట్టి ఈ ఐ-డిబిపి రసాయనాలు ఏర్పడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
అమ్మోనియా ఆధారిత రసాయనాలకంటే, క్లోరిన్ కలిపిన నీటిని వంటకు వాడితే మంచిదని, అలాగే పొటాషియం అయోడైడ్ చేసిన ఉప్పుకి బదులు, పొటాషియం అయోడేట్ చేసిన ఉప్పుని వాడాలని డాక్టర్ జాంగ్ సూచిస్తున్నారు. అలాగే తక్కువ మంటమీద తక్కువ సమయం ఉడికించాలని కూడా సూచిస్తున్నారు.